శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగశక్తి పథకాన్ని బుధవారం నాడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ సంయుక్తంగా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ….ప్రత్యేక ప్రతిభావంతుల ప్రయాణ సౌకర్యాల మెరుగుదలకు ఈ పథకం దోహదపడుతుందని శ్రీకాళహస్తి ఆర్టీసీ పరిధిలో 98 బస్సులు దివ్యాంగులకు అనుకూలంగా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇప్పటికే పీహెచ్సీ పాస్‌లు కలిగిన 359 మంది లబ్ధిదారులు ఉండగా పట్టణ పరిధిలో మొత్తం 1972 మంది ప్రత్యేక ప్రతిభావంతులు ఉన్నారని వివరించారు. ఈ పథకం కింద మహిళాశక్తి బస్సుల్లో దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించబడుతుందని, డీలక్స్, లగ్జరీ బస్సుల్లో 50 శాతం రాయితీ ఇవ్వబడుతుందని అర్హులైన దివ్యాంగులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్, ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

బొజ్జల కుటుంబం సమక్షంలో శ్రీకాళహస్తిలో దివ్యాంగశక్తి పథకం ప్రారంభం