పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం
రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు మాజీ ఎంపీటీసీ పి. రమేష్ రెడ్డి అన్న జన్మదినాన్ని ఆయన అనుచరులు, స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు, చంద్రగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సెంథిల్ కుమార్ ఆధ్వర్యంలో రమేష్ రెడ్డి శాలువాతో సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కటింగ్ చేశారు ఆయన సేవలను కొనియాడారు. భవిష్యత్తులో ప్రజాసేవలో మరింత ముందుకు సాగి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.



