ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం శ్రీ రక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రక్ష ఆరోగ్య సురక్ష యాత్ర కార్యక్రమం శనివారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బోనకల్లు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆరోగ్య సలహా లు సూచనలు వైద్యుల నుండీ పొందారు.
ఈ యాత్రను డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో బోనకల్ సర్పంచ్ బాణావత్ కొండలు, షేక్ ఏడుకొండలు, డాక్టర్ హనుమంతరావు, గజ్జల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైద్యులు గ్రామ ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ, వివిధ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గ్రామాల్లో ఆరోగ్య సేవలు ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ, ఇలాంటి వైద్య శిబిరాలు తరచూ నిర్వహించాలని కోరారు.



