భారత ప్రభుత్వం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో చేపట్టిన 100 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం భాగంగా ప్రగతి సంస్థ నిర్వహించిన ‘బాల్య వివాహ విముక్తి రథం’ ప్రచార యాత్ర విజయవంతంగా ముగిసింది. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ చేత ప్రారంభమైన ఈ రథయాత్ర జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, పట్టణాల్లో పర్యటిస్తూ బాల్య వివాహాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించింది. 100 రోజుల అవగాహన కార్యక్రమం ముగింపు సందర్భంగా తొట్టంబేడు మండలం పెద్ద కన్నలి గ్రామంలో గ్రామస్తులు కొవ్వొత్తులు వెలిగించి బాల్య వివాహాల నిర్మూలనకు తమ మద్దతు ప్రకటించారు. శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న ఏపిడబ్ల్యూఆర్ఎస్ గర్ల్స్ హాస్టల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి సంస్థ డైరెక్టర్ కె.వి. రమణ మాట్లాడుతూ….ప్రగతి సంస్థ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ నెట్వర్క్లో భాగస్వామి సంస్థగా బాల్య వివాహాల నిర్మూలన కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఈ 100 రోజుల అవగాహన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ పార్లమెంట్లో బాల్య వివాహాల నిర్మూలన చట్టం పూర్తి స్థాయిలో అమలుకు కృషి చేస్తామని చెప్పడం ఆనందదాయకమని బాల్య వివాహం ఒక సామాజిక రుగ్మత మాత్రమే కాదు, పెళ్లి పేరుతో చిన్నారిపై జరిగే అత్యాచారమే. ఇది చట్టం ప్రకారం నేరం, బాల్య వివాహం ఒక అమ్మాయి భవిష్యత్తును నాశనం చేసి, ఆమెను పోషకాహార లోపం, అక్షరాస్యత లేకపోవడం, పేదరికం అనే చీకటి లోకంలోకి నెడుతుందని ప్రభుత్వం, ప్రజలు, ప్రజాసంఘాలు, ఎన్జీఓలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ ప్రచారం ప్రజా ఉద్యమంగా మారిందని అందరి సహకారంతో బాల్య వివాహాలు లేని తిరుపతి జిల్లా లక్ష్యాన్ని త్వరలోనే సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బాల్య వివాహ విముక్తి రథం కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, దేవాలయ పూజారులు, చర్చ్ పాస్టర్లు, మసీదు మౌళీలు, హజరత్లు మరియు వివిధ మత పెద్దలు పాల్గొని బాల్య వివాహాలు చేయకూడదని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన పత్రికా మిత్రులకు, ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అయన తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, వార్డెన్ విజయలక్ష్మి, ప్రగతి సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రాజారెడ్డి, సిబ్బంది కోటయ్య, లత, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

విజయవంతంగా ముగిసిన బాల్య వివాహ విముక్తి రథ ప్రచార యాత్ర