కావలికి చెందిన రమాజ్యోతి అనే వృద్ధురాలిని ఆమె కన్నకొడుకే మోసం చేసి ఇల్లు తన పేరుమీద రాయించుకుని బయటకు గెంటేశాడు. నిలువనీడ లేక ఇబ్బందులు పడుతున్న ఆమె, సమస్యను తెలియజేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గారిని గ్రీవెన్స్‌లో ఆశ్రయించింది. తన నివాసాన్ని మభ్యపెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
మానవీయ దృక్పథంతో స్పందించిన కలెక్టర్ గారు వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి విచారణ చేపట్టించారు. చట్టపరమైన ప్రక్రియను అనుసరించి అన్యాయంగా జరిగిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించారు. అనంతరం ఆ ఇంటిని తిరిగి రమాజ్యోతి గారికే గౌరవప్రదంగా అప్పగించారు.
తనకు న్యాయం చేసిన కలెక్టర్ హిమాన్షు శుక్లా గారిని స్వయంగా కలిసి రమాజ్యోతి కృతజ్ఞతలు తెలియజేశారు. “కన్నకొడుకు గెంటేశాడు… కానీ జిల్లా కలెక్టర్ పెద్ద కొడుకులా కాపాడారు” అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

గొప్ప మనసు చాటుకున్న నెల్లూరు కలెక్టర్ హిమాన్ శుక్ల
కావలికి చెందిన రమాజ్యోతి అనే వృద్ధురాలిని ఆమె కన్నకొడుకే మోసం చేసి ఇల్లు తన పేరుమీద రాయించుకుని బయటకు గెంటేశాడు. నిలువనీడ లేక ఇబ్బందులు పడుతున్న ఆమె, సమస్యను తెలియజేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గారిని గ్రీవెన్స్‌లో ఆశ్రయించింది. తన నివాసాన్ని మభ్యపెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. మానవీయ దృక్పథంతో స్పందించిన కలెక్టర్ గారు వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి విచారణ చేపట్టించారు. చట్టపరమైన ప్రక్రియను అనుసరించి అన్యాయంగా జరిగిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించారు. అనంతరం ఆ ఇంటిని తిరిగి రమాజ్యోతి గారికే గౌరవప్రదంగా అప్పగించారు. తనకు న్యాయం చేసిన కలెక్టర్ హిమాన్షు శుక్లా గారిని స్వయంగా కలిసి రమాజ్యోతి కృతజ్ఞతలు తెలియజేశారు. “కన్నకొడుకు గెంటేశాడు… కానీ జిల్లా కలెక్టర్ పెద్ద కొడుకులా కాపాడారు” అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

