ఉదయగిరి Sub-Registrar ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్‌గా కర్తవ్యనిష్ఠతో, నిజాయితీతో సేవలందించిన శ్రీ బండారు వెంకటేష్ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని శాలువాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ సేవలో ఆయన చూపిన అంకితభావం, క్రమశిక్షణ, ప్రజల పట్ల మానవతా దృక్పథం అందరికీ ఆదర్శంగా నిలిచాయి. కార్యాలయ అభివృద్ధికి, ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమే. రిటైర్మెంట్ అనంతరం ఆయురారోగ్యాలతో, ఆనందంతో, కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.



