అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికార వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పి డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అపోలో హాస్పిటల్స్ , పెన్నా హాస్పిటల్స్ వైద్యుల సహకారంతో పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులకు పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. 212 మంది మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పి సూచించారు. వైద్యులను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.



