*భూబకాసురుల రాక్షస హస్తాలలోకుమ్మరకుంట..*
*ఈ బూర్జువా పార్టీల నాయకుల్లో*
*పేదలకు న్యామెక్కడ*
*వెల్లూరు సుమన్ ప్రజాపతి…ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు.*
*మర్రిపాడు. పున్నమి ప్రతినిది*
మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలో 293 గల సర్వే నంబర్ గల 3: 32 ఎకరాల కుమ్మర మాన్యాన్ని అదే గ్రామానికి చెందిన అగ్ర కుల నాయకులు కబ్జా చేసి తమ పేర్లు మీద ఆన్లైన్లో చేసుకున్నారని తమకు న్యాయం కావాలని కుమ్మరి మాన్యాన్ని తమకు ఇవ్వాలని స్థానిక రెవిన్యూ కార్యాలయం లో ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు.వెల్లూరు సుమన్ ప్రజాపతి అర్జీ సమర్పించారు. 70 సంవత్సరాలకు పైగా ఉన్న 3 ఎకరాల కుమ్మరకుంట, భూబకాసురుల రాక్షస హస్తాలలో చిక్కుకుందని,ఆవేదన వ్యక్తం చేశారు.తమకు న్యాయం జరగక పోతే పోరాటాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన, ఈ సమస్యపై కూడా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మర్రిపాడు మండల రెవెన్యూ తహసీల్దార్ ఈ విషయం ఫై క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కారం చేయమని కోరుతున్నట్లు తెలియజేసారు.
.
Uploaded Video:



