ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్‌లోని సంగమేశ్వర గిరిజన కాలనీలో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. యాకసిరి రత్నం ఇంటిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. కట్టుబట్టలు, నిత్యావసర సరుకులు, రూ.10 వేల నగదు కాలిపోయి సుమారు రూ.30 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. సమాచారం తెలుసుకున్న టిడిపి నేత సానే వెంకటరమణయ్య బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసి ఆదుకున్నారు. కార్యక్రమంలో శివుడు, రాజా గౌడ్, జితేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బద్దెవోలు క్రాస్‌లో అగ్ని ప్రమాదం – బాధిత కుటుంబానికి టిడిపి నేత సానే వెంకటరమణయ్య సాయం