ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలో గలర
వంగా ముత్యాల బంజర లోని శ్రీ రాజా సాయి మందిరంలో గురువారం శాశ్వత దాతల సహకారంతో పాటు పలువురు దాతల ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఆచంటి రాణి – సుందర్ రావు దంపతుల పెళ్లిరోజు సందర్భంగా, అలుగోజు ఉదయ్ విష్ణువర్ధన్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు లక్ష్మీ, రామ నర్సింహం, రామచంద్రరావు, బలుసుపాటి రమాదేవి, రామచంద్రరావు కుటుంబ సభ్యులు, అలాగే పరకాల మనీషా – సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు కృపమ్మ, రాంబాబు, రామచంద్రరావు అన్నదానం నిర్వహించారు.
అదే విధంగా రిటైర్డ్ ఎస్పీ శ్రీ తిరుపతి ఐపీఎస్ గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని కూడా ప్రత్యేకంగా అన్నదానం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి సాయి మణికంఠ, ఎల్వి ఆర్కే దత్తు, ప్రసాద్, లైబ్రరీ సత్యనారాయణ, జెన్నారెడ్డి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


