జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ బుధవారం రాష్ట్రస్థాయిలో పార్టీ అగ్రనేతలు, ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ సంస్థాగత బలోపేతం, జిల్లాలో పార్టీ కార్యక్రమాల విస్తృతిపై ఈ సందర్భంగా ఆయన పలువురు నేతలతో చర్చించారు. ముందుగా విజయవాడలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో బస చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు (MLC) కొణిదల నాగేంద్ర బాబు (నాగబాబు)ని అంజూరు చక్రధర్ కలిశారు. జిల్లాలో పార్టీ పరిస్థితిని, రాబోయే రోజుల్లో చేపట్టబోయే సేవా కార్యక్రమాలను ఆయన నాగబాబుకు వివరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ..పార్టీ శ్రేణులు ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.

నాగబాబుతో అంజూరు చక్రధర్ మర్యాదపూర్వక భేటీ-పార్టీ బలోపేతంపై చర్చ