కుల వివక్ష దాడిలో పసికందు మరణానికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలి.
మొన్న నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామం దేవుని జాతరలో కులవివక్షతో మహిళపై దాడి చేసి పసికందు మరణానికి సంభందించిన ఘటన నిందితులను తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర మండల రజక సంఘం మరియు బీసీ, ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరియు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆ దుర్మార్గులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది.
ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి కుల అహంకారంతో బీసీ, దళిత కుటుంబానికి చెందిన వారిపై అమానుషంగా దాడి చేసి రెండు నెలల పసికందు మరణానికి కారణమైన వాళ్లపై హత్యకేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు నమోదు చేయించాలని, రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ ఎస్టీలపై ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే కుమ్మెర నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబమైన గణేష్, చంద్రకళలకు ప్రభుత్వపరంగా 50 లక్షలు రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించాలని కోరుతూ… ఈ కేసు ఘటనలో సంబంధం ఉన్న అందరనీ ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు తలగకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆ బీసీ రజక కుటుంబానికి న్యాయం జరిగే వరకు బడుగు బలహీన వర్గాలు ఒక్కటిగా పోరాటం చేస్తామని ఇలాంటి ఘటనలను అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు కూడా కండించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో రజక మండల సంఘం నాయకులు, బీసీ సంఘాల నాయకులు, ఎస్సీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



