శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటుతుండగా, స్వామి, అమ్మవార్ల అలంకరణలో మరో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీరంగ ఎంటర్ప్రైజెస్, అలంకార సేవా ట్రస్ట్ ప్రతినిధులు ముక్కంటిపై తమ భక్తిని చాటుకున్నారు. శ్రీ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల కోసం ప్రత్యేకంగా చేయించిన ముత్యాల కవచాలను శనివారం నాడు ఆలయ అధికారులకు అందజేశారు. భక్తిభావంతో అపురూప కానుక హైదరాబాద్ వాస్తవ్యులైన దాతలు ఈ అపురూపమైన ముత్యాల కవచాలను ఆలయ కార్యనిర్వహణాధికారికి శాస్త్రోక్తంగా అందజేశారు. అత్యంత ఖరీదైన, నాణ్యమైన ముత్యాలతో నైపుణ్యం కలిగిన కళాకారులచే ఈ కవచాలను రూపొందించారు. ఉత్సవమూర్తులకు ఈ కవచాలను అలంకరించినప్పుడు వారి వైభవం మరింత దేదీప్యమానంగా వెలుగుతుందని దాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ మాట్లాడుతూ.. లోక కళ్యాణం కోసం జరిగే ఉత్సవాల్లో స్వామివారి అలంకరణకు ఇలాంటి విరాళాలు అందజేయడం అభినందనీయమన్నారు. దాతలకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, వారికి ఆలయ మర్యాదలతో తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. బ్రహ్మోత్సవాల వేళ విదేశీ భక్తుల రాకతో పాటు, ఇలాంటి భారీ విరాళాలు అందడం ఆలయ ప్రాశస్త్యాన్ని చాటుతోందని భక్తులు చర్చించుకుంటున్నారు. ఆలయాదికారులు దాతలకు శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యెక దర్సన ఏర్పాట్లు చేయించి తీర్ధ, ప్రసాదాలు అందజేశారు.

ముక్కంటిశునికి ముత్యాల సొబగులు-స్వామి, అమ్మవార్లకు ముత్యాల కవచాలు విరాళం