Friday, 20 February 2026
  • Home  
  • “ప్రకృతి సంగీత శ్వాస – మాతృభాష” – డాక్టర్ బద్రి పీర్ కుమార్
- సాహితీ

“ప్రకృతి సంగీత శ్వాస – మాతృభాష” – డాక్టర్ బద్రి పీర్ కుమార్

బంగ్లా భాషా ఉద్యమం మరియు మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని 1999 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రకటించింది యునెస్కో. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలుగుతామని యునెస్కో భావించి ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినంగా ప్రకటించడం వలన 2000 సంవత్సరం ఫిబ్రవరి 21 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మాతృ భాష దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. రాష్ట్రం ఏదైనా దేశం ఏదైనా తల్లి నుండి బిడ్డకు సంక్రమించే అమృతభాష మాతృభాష. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈ కవిత *అం* అంతరంగ భావతరంగఘని *త* తరగని సుసంపన్న ధ్వని *ర్జా* జాతి చరిత్రరీతి ప్రకాశిని *తీ* తీరు మారని అనుబంధ ఆమని *య* యవ్వనానంద సరాగిణి *మా* మానవత్వ మధుర భామిని *తృ* తృణముకాని త్రికాలమణి *భా* భావవ్యక్తీకరణ సంస్కరిణి *షా* షాన్మయం జనలోకాభినయం *ది* దివ్యమైన ప్రకృతిలో శ్వాసగ *నో* నోటిబాటలో విహరిస్తున్న హృదయమాధురి *త్స* ఉత్సవశోభతో కదలాడే కమనీయ భావసిరి *వం* వందనం అభినందనం భాషామతల్లికి సదా నీరాజనం ఆత్మీయ అర్థాంశాల సూచకం పరవశించు జీవుల మనో నేత్రదాయకం స్పందించు మానవ హృదయ జ్ఞాపకం సాక్షాత్ ప్రకృతి సంగీత సరస్వతి రూపకం – మాతృభాష

బంగ్లా భాషా ఉద్యమం మరియు మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని 1999 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రకటించింది యునెస్కో. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలుగుతామని యునెస్కో భావించి ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినంగా ప్రకటించడం వలన 2000 సంవత్సరం ఫిబ్రవరి 21 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మాతృ భాష దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. రాష్ట్రం ఏదైనా దేశం ఏదైనా తల్లి నుండి బిడ్డకు సంక్రమించే అమృతభాష మాతృభాష. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈ కవిత

*అం* అంతరంగ భావతరంగఘని
*త* తరగని సుసంపన్న ధ్వని
*ర్జా* జాతి చరిత్రరీతి ప్రకాశిని
*తీ* తీరు మారని అనుబంధ ఆమని
*య* యవ్వనానంద సరాగిణి

*మా* మానవత్వ మధుర భామిని
*తృ* తృణముకాని త్రికాలమణి
*భా* భావవ్యక్తీకరణ సంస్కరిణి
*షా* షాన్మయం జనలోకాభినయం

*ది* దివ్యమైన ప్రకృతిలో శ్వాసగ
*నో* నోటిబాటలో విహరిస్తున్న హృదయమాధురి
*త్స* ఉత్సవశోభతో కదలాడే కమనీయ భావసిరి
*వం* వందనం అభినందనం
భాషామతల్లికి సదా నీరాజనం

ఆత్మీయ అర్థాంశాల సూచకం
పరవశించు జీవుల మనో నేత్రదాయకం
స్పందించు మానవ హృదయ జ్ఞాపకం
సాక్షాత్ ప్రకృతి సంగీత సరస్వతి రూపకం – మాతృభాష

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.