Monday, 16 February 2026
  • Home  
  • విశాఖ తీరంలో మోహరించనున్న 90నౌకలు…అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు సిద్ధం
- విశాఖపట్నం

విశాఖ తీరంలో మోహరించనున్న 90నౌకలు…అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు సిద్ధం

విశాఖ ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి): విశాఖ తీర ప్రాంతం అంతర్జాతీయ నౌకాదళ మహాసమ్మేళనానికి వేదికగా సిద్ధమవుతోంది. ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో జరుగుతున్న మిలన్ కార్యక్రమం భాగంగా విశాఖలోని నావికాదళ కమాండ్ సాముద్రిక ప్రాంగణంలో మిలన్ విలేజ్‌ను తూర్పు నావికాదళ చీఫ్ సంజయ్ భల్లా ప్రారంభించారు.ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా మొత్తం 90నౌకలు మోహరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఇందులో 71దేశీయ నౌకలు,19విదేశీ యుద్ధనౌకలు పాల్గొననున్నాయి.అలాగే 50యుద్ధవిమానాలు ఆకాశంలో విన్యాసాలు చేయనున్నాయి.సముద్రంలో నౌకలను ఆరు వరుసల్లో సక్రమంగా మోహరించి దేశాధ్యక్షుడైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమీక్షించనున్నారు.మిలన్ నౌకాదళ విన్యాసంలో ప్రస్తుతం 65దేశాలు భాగస్వామ్యం అవుతున్నాయి.సముద్ర భద్రత,సహకార సంబంధాలు,వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరగనున్నాయి.ఈనెల 19న నిర్వహించనున్న సిటీ పరేడ్‌లో 45దేశాల నౌకాదళ కంటెంజెంట్లు పాల్గొని తమ సాంప్రదాయ దుస్తులు,సైనిక క్రమశిక్షణను ప్రదర్శించనున్నాయి.విశాఖ తీరంలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమ్మేళనం నగరానికి ప్రత్యేక గుర్తింపునందించనుండగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

విశాఖ ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి):

విశాఖ తీర ప్రాంతం అంతర్జాతీయ నౌకాదళ మహాసమ్మేళనానికి వేదికగా సిద్ధమవుతోంది. ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో జరుగుతున్న మిలన్ కార్యక్రమం భాగంగా విశాఖలోని నావికాదళ కమాండ్ సాముద్రిక ప్రాంగణంలో మిలన్ విలేజ్‌ను తూర్పు నావికాదళ చీఫ్ సంజయ్ భల్లా ప్రారంభించారు.ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా మొత్తం 90నౌకలు మోహరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఇందులో 71దేశీయ నౌకలు,19విదేశీ యుద్ధనౌకలు పాల్గొననున్నాయి.అలాగే 50యుద్ధవిమానాలు ఆకాశంలో విన్యాసాలు చేయనున్నాయి.సముద్రంలో నౌకలను ఆరు వరుసల్లో సక్రమంగా మోహరించి దేశాధ్యక్షుడైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమీక్షించనున్నారు.మిలన్ నౌకాదళ విన్యాసంలో ప్రస్తుతం 65దేశాలు భాగస్వామ్యం అవుతున్నాయి.సముద్ర భద్రత,సహకార సంబంధాలు,వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరగనున్నాయి.ఈనెల 19న నిర్వహించనున్న సిటీ పరేడ్‌లో 45దేశాల నౌకాదళ కంటెంజెంట్లు పాల్గొని తమ సాంప్రదాయ దుస్తులు,సైనిక క్రమశిక్షణను ప్రదర్శించనున్నాయి.విశాఖ తీరంలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమ్మేళనం నగరానికి ప్రత్యేక గుర్తింపునందించనుండగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.