ఖమ్మం, ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి)
ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులకు కార్యకర్తలుగా మారి ఎన్నికల్లో పనిచేస్తామని హామీలు ఇవ్వడం తీవ్ర ఆందోళనకరమని ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని వారు పేర్కొన్నారు.
ఈ అంశంపై సంబంధిత అధికారులపై వెంటనే సస్పెన్షన్‌తో సహా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి పి. శ్రీజను కలిసి బీజేపీ బృందం వినతి పత్రం అందజేసింది.
జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, శ్రీమతి దొడ్డ అరుణ, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, పాలేరు శాసన సభ బీజేపీ అభ్యర్థి నున్న రవికుమార్, బీజేపీ ఏద్యుకేషన్ సెల్ జిల్లా కన్వీనర్ ఆచంటి కోటేశ్వరరావు, వి. రామకృష్ణ, పి. జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.



