శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: ముక్కంటి క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ భక్తుల ఆకలి తీర్చేందుకు నంద్యాలకు చెందిన దాతలు తమ ఉదారతను చాటుకున్నారు. నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ రామన్న అండ్ సన్స్ సంస్థ ప్రతినిధి ప్రసాద్ మంగళవారం నాడు సుమారు 40 టన్నుల వివిధ రకాల తాజా కూరగాయలను దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ సమక్షంలో ఆలయాధికారులకు విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా దాత ప్రసాద్ మాట్లాడతూ.. బ్రహ్మోత్సవాల సమయంలో దేశం నలుమూలల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులకు స్వామివారి ప్రసాదం (అన్నదానం) లో ఎటువంటి లోటు రాకూడదనే ఉద్దేశంతో ఈ వితరణ చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం దేవస్థానం వారు దాతలను ఘనంగా సత్కరించి, శ్రీ స్వామి, అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకోసం నంద్యాల నివాసులు చేస్తున్న ఈ సేవను ఆలయ పాలక మండలి సభ్యులు కొనియాడారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆయాలనికి 40 టన్నుల కూరగాయల విరాళం