అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 6 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ :
పాయకరావుపేట నియోజకవర్గంలో ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైతిక విలువలు) బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. హోం మంత్రి వంగలపూడి అనిత గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన విద్యాదీప్తి – సంస్కార స్ఫూర్తి కార్యక్రమంలో చాగంటి గారు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, గురు–తల్లిదండ్రుల గౌరవం, కష్టపడి చదవడం, దురలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు హితవు పలికారు. ఈ ప్రవచనాలు విద్యార్థుల్లో కొత్త ఆలోచనలకు, మంచి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేశాయి.



