ఖమ్మం, జనవరి
(పున్నమి దిన పత్రిక జిల్లా స్టాఫర్)
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా డి.డి.ఎన్ అర్చక సంఘం అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మను ఉత్తమ అర్చకునిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనీదీప్ దురిశెట్టి చేతుల మీదుగా రమేష్ శర్మ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
ఈ అవార్డు అందుకోవడం పట్ల రమేష్ శర్మ హర్షం వ్యక్తం చేస్తూ, తనను ఉత్తమ అర్చకునిగా ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ గౌరవానికి సహకరించిన దేవాదాయ ధర్మదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ వీరస్వామి గారికి, కార్యాలయ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే అర్చక ఉద్యోగ సంఘం అధ్యక్షులు తోటకూర వెంకటేశ్వర్లు గారికి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చక సంఘం అధ్యక్షులు దాములూరు వీరభద్రం శర్మ గారికి, రాష్ట్ర డి.డి.ఎన్ సంఘం ప్రధాన కార్యదర్శి అన్నావజ్జల ప్రసాద్ శర్మ గారికి, జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి యం.భర్గవాచార్యులు గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులకు మరియు ఖమ్మం జిల్లా డి.డి.ఎన్ అర్చకులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు


