Sunday, 29 March 2026
  • Home  
  • తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు – పల్లా శ్రీనివాసరావు
- విశాఖపట్నం

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు – పల్లా శ్రీనివాసరావు

గాజువాక (పున్నమి ప్రతినిధి): కష్టాల్లో ఉన్న కార్యకర్తను ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలపై జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలను ఆయన సత్కరించి అభినందించారు. గాజువాక తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త, ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజల కష్టాలనే తన కష్టాలుగా భావిస్తూ పోరాడే వారికే ఈ గౌరవం దక్కుతుందని అన్నారు. పార్టీ కోసం స్వార్థాన్ని పక్కనపెట్టి ముందుండి నిలబడి పనిచేసే వాడే నిజమైన కార్యకర్త అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, లేళ్ళ కోటేశ్వరరావు, కాకి గోవిందరెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, రాష్ట్ర డైరెక్టర్ మొలిపింటి రాజు, వార్డు అధ్యక్షులు నల్లూరి సూర్యనారాయణ, కర్రి దసేంద్ర, బైపల్లి గాంధీ, నియోజకవర్గ నాయకులు తమిరె శివప్రసాదరావు, విల్లా రాంమోహన్, దొడ్డి సత్యారావు, అర్శివల్లి దీప్తి, పల్లా రమణ తదితరులు పాల్గొన్నారు.

గాజువాక (పున్నమి ప్రతినిధి):

కష్టాల్లో ఉన్న కార్యకర్తను ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలపై జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలను ఆయన సత్కరించి అభినందించారు. గాజువాక తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త, ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజల కష్టాలనే తన కష్టాలుగా భావిస్తూ పోరాడే వారికే ఈ గౌరవం దక్కుతుందని అన్నారు. పార్టీ కోసం స్వార్థాన్ని పక్కనపెట్టి ముందుండి నిలబడి పనిచేసే వాడే నిజమైన కార్యకర్త అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, లేళ్ళ కోటేశ్వరరావు, కాకి గోవిందరెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, రాష్ట్ర డైరెక్టర్ మొలిపింటి రాజు, వార్డు అధ్యక్షులు నల్లూరి సూర్యనారాయణ, కర్రి దసేంద్ర, బైపల్లి గాంధీ, నియోజకవర్గ నాయకులు తమిరె శివప్రసాదరావు, విల్లా రాంమోహన్, దొడ్డి సత్యారావు, అర్శివల్లి దీప్తి, పల్లా రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.