Thursday, 2 April 2026
  • Home  
  • మోషంపూర్ పెద్ద చెరువు మిషన్ కాకతీయ నిధులు ఎక్కడా!!
- కామారెడ్డి

మోషంపూర్ పెద్ద చెరువు మిషన్ కాకతీయ నిధులు ఎక్కడా!!

కట్ట మట్టి పోసినా నీళ్లు వృధాగా పోతున్నాయి ప్రజలు ఇబ్బంది! నిధులపై విచారణ చేస్తారా లేదా?!? కామారెడ్డి, 12 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డిజిల్లా, రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలోని పెద్ద చెరువు మిషన్ కాకతీయ పథకం కింద బాగా మట్టిపోసినా, కట్టలో చీలికల వల్ల నీళ్లు ఉదకొచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చిన్న తుమ్ వద్ద నీళ్లు వృధాగా పోతున్నాయి, బతుక మ్మ మెట్లు కట్టలేదు. గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. నీటిపారుదల అధికారికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు రాజేం దర్ ఎక్స్ లిఖించిన లేఖలో, “చెరువు కట్టపై మట్టి పోసారు కానీ, చిన్నతూమ్ వద్ద నీళ్లు ఉదగొచ్చి పోతున్నాయి. బతుకమ్మ మెట్లు కూడా కట్టలేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ నిధులు ఎప్పుడు, ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత నిధులు మిగిలాయి? వివరాలు రాతపూర్వకంగా ఇవ్వండి” అంటూ మనవి చేశారు. లేఖలో మోషం పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నా రు. మిషన్ కాకతీయలో చెరువులు బలోపేతం చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ కట్టలో చీలికలు, మెట్లు లేకపోవడంతో వర్షాకాలంలో నీళ్లు వృథా అవుతున్నాయి. వ్యవసాయానికి, తాగునీటికి ఆధారమైన చెరువు ఇలా వదిలిపెట్టడం దారుణం. అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలి.అంటు నీటిపారుదల అధికారులు స్పందించకపోవడంతో, గ్రామస్తులు మండిపడుతున్నారు. మండల అధికా రి కామారెడ్డి ఆఫీసుకు లేఖ ఇచ్చిన రాజేందర్, పూర్తి వివరాలు రాకముందు పనులు పూర్తి చేయా లని డిమాండ్ చేశారు.ఈ సమస్య పరిష్కారం కాకపోతే, గ్రామస్తులు పెద్ద కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మిషన్ కాకతీయ నిధులు సరి గ్గా ఉపయోగించాలని, ప్రజల ఆవేదనలు తీర్చాల ని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

కట్ట మట్టి పోసినా నీళ్లు వృధాగా పోతున్నాయి ప్రజలు ఇబ్బంది!

నిధులపై విచారణ చేస్తారా లేదా?!?

కామారెడ్డి, 12 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :

కామారెడ్డిజిల్లా, రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలోని పెద్ద చెరువు మిషన్ కాకతీయ పథకం కింద బాగా మట్టిపోసినా, కట్టలో చీలికల వల్ల నీళ్లు ఉదకొచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చిన్న తుమ్ వద్ద నీళ్లు వృధాగా పోతున్నాయి, బతుక మ్మ మెట్లు కట్టలేదు. గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. నీటిపారుదల అధికారికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు రాజేం దర్ ఎక్స్ లిఖించిన లేఖలో, “చెరువు కట్టపై మట్టి పోసారు కానీ, చిన్నతూమ్ వద్ద నీళ్లు ఉదగొచ్చి పోతున్నాయి. బతుకమ్మ మెట్లు కూడా కట్టలేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ నిధులు ఎప్పుడు, ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత నిధులు మిగిలాయి? వివరాలు రాతపూర్వకంగా ఇవ్వండి” అంటూ మనవి చేశారు. లేఖలో మోషం పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నా రు. మిషన్ కాకతీయలో చెరువులు బలోపేతం చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ కట్టలో చీలికలు, మెట్లు లేకపోవడంతో వర్షాకాలంలో నీళ్లు వృథా అవుతున్నాయి. వ్యవసాయానికి, తాగునీటికి ఆధారమైన చెరువు ఇలా వదిలిపెట్టడం దారుణం. అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలి.అంటు నీటిపారుదల అధికారులు స్పందించకపోవడంతో, గ్రామస్తులు మండిపడుతున్నారు. మండల అధికా రి కామారెడ్డి ఆఫీసుకు లేఖ ఇచ్చిన రాజేందర్, పూర్తి వివరాలు రాకముందు పనులు పూర్తి చేయా లని డిమాండ్ చేశారు.ఈ సమస్య పరిష్కారం కాకపోతే, గ్రామస్తులు పెద్ద కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మిషన్ కాకతీయ నిధులు సరి గ్గా ఉపయోగించాలని, ప్రజల ఆవేదనలు తీర్చాల ని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.