– పాలకులు అధికారులకు గౌరవం
కామారెడ్డి, 03 జనవరి, పున్నమి ప్రతినిధి :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పాలకవర్గం సభ్యులు ఆమె కు హృదయపూర్వక నివాళులు అర్పించారు. ఈ మహత్తరోహణ వేడుకల్లో మండల అధికారులకు అసాధారణ సత్కారం జరిగింది.వేడుకల సమ యంలో పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ,మన మండల అధికారుల ప్రజాసేవలకు గ్రామ పాలక వర్గం తరపున ఘన సన్మానం నిర్వహించామని అన్నారు. తహసీల్దార్ ఉమలత, ఎస్ఐ రాజశేఖర్, ఎంపీడీఓ నాగేశ్వరరావును శాలువాలతో, ఘనం గా సన్మానించామని అన్నారు.అధికారులు స్పంది స్తూ, ప్రజల మన్ననలు మాకు గొప్ప శక్తి. ఉన్నత శిఖరాలు అదిరోహించి, మహోన్నత జీవితం గడుపుతామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ సుమలత మాట్లాడుతూ, గ్రామీణ సంక్షేమంలో తమ కృషి ఫలితాలే ముఖ్యమని చెప్పారు. ఎస్ఐ రాజశేఖర్ పోలీసు సేవల్లో ప్రజల సహకారాన్ని ప్రశంసించారు.ఈ సన్మానం మండలంలో పాలకు లు-అధికారుల మధ్య సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శించిం దని అన్నారు. గ్రామస్తులు సంతోషంగా పంచుకు న్నారు. ఇలాంటి ఘటనలు మా మండలాన్ని మరింత ముందుకు దూసుకెళ్తాయని అన్నారు. సావిత్రి బాయి పూలే ఆదర్శాలు, ప్రజాసేవలు ఈ వేడుకల్లో మరింత ప్రకాశింపజేశాయి.



