Wednesday, 11 February 2026
  • Home  
  • కామారెడ్డి కలెక్టర్ గిద్ద గ్రామంలో ఆకస్మిక తనిఖీ లు..
- కామారెడ్డి

కామారెడ్డి కలెక్టర్ గిద్ద గ్రామంలో ఆకస్మిక తనిఖీ లు..

ఇందిరమ్మ ఇళ్ల నుంచి స్కూల్ వరకు పరిశీలన! కామారెడ్డి, 02జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం గిద్దలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డ్రైనేజీ, స్కూల్ విద్యా స్థాయి.. అన్నీ చూసి సూచనలు.గ్రామీణ ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయా? ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతుందా? స్కూళ్లలో పిల్లలు బాగా చదువుతున్నారా? ఇలాంటి కీలక అంశాలపై జిల్లా కలెక్టర్ ఆశిస్ సాంగ్వాన్ శుక్రవారం రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలో ఆకస్మిక సంద ర్శన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నుంచి ప్రభుత్వ పాఠ శాల వరకు అన్నీ పరిశీలించి,స్థానికులు,అధికారు లకు కీలక సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: ‘వేగంగా పూర్తి చేయండి.. నాణ్యత మరచవద్దు!’ గిద్ద గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారు ఇల్లు నిర్మిస్తున్న స్థలాన్ని కలెక్టర్ సాంగ్వా న్ ముందుగా పరిశీలించారు. పనుల పురోగతిని దగ్గరగా చూసి, లబ్ధిదారుతో మాట్లాడారు.ఇంటి నిర్మాణాన్ని వేగవంతం చేయండి.ప్రభుత్వం కట్టు బడి ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసి, నాణ్య తతో పూర్తి చేయాలి,” అని సూచించారు.లబ్ధిదారు చెప్పిన వివరాల్లో ఇప్పటివరకు ఖర్చు, తీసుకున్న రుణాలు, దశలవారీ నిధి కేటాయింపు, మునుపటి నివాసం, ప్రస్తుత ఉద్యోగం వంటి అంశాలు తెలుసు కున్నారు. గ్రామంలో డ్రైనేజీ కాలువలు,రోడ్ల రెండు వైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు పనుల ను పరిశీలించారు.పిచ్చి, చెత్త తొలగించి డ్రైనేజీ సరిగ్గా పనిచేయాలి. రోడ్లు శుభ్రంగా ఉండేలా, నీరు నిలవకుండా చూడండి. గ్రామంలో పరిశుభ్రతా కార్యక్రమాలు నిరంతరం జరగాలి,” అని అధికారు లకు ఆదేశాలు జారీ చేశారు.అనంతరం గ్రామంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లకు చేరుకున్న కలెక్టర్, విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ చేశారు. తరగతి గదిలో బోర్డుపై గణిత లెక్కలు వ్రాయించి, పిల్లల విద్యా సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించా రు. ఒక విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. పిల్లలు చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉపాధ్యా యులు నాణ్యమైన బోధన చేయాలి.ప్రాథమిక నైపుణ్యాలు మెరుగుపడేలా ప్రత్యేక చర్యలు తీసు కోవాలని సూచించారు. పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పెట్టు కోవాలని, ప్రత్యేక తరగతు లు నిర్వహించి లోపాలు సరిచేయాలని ఆదేశించా రు.ప్రతి పిల్ల ప్రతిభను వెలికితీయాలి.పరీక్షలకు పూర్తిగా సిద్ధం చేయాలని పేర్కొన్నారు.స్కూల్ ఆవరణంలో పిచ్చి,చెత్త లేకుండా శుభ్రంగా ఉంచా లని సూచించారు. కలెక్ట ర్ సందర్శనల్లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ్, ఆర్డిఓ వీణ, తహసిల్దార్ ఉమలత, డిపీఓ, డీఎం, డీఈఓ రాజు, ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నుంచి స్కూల్ వరకు పరిశీలన!

కామారెడ్డి, 02జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :

కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం గిద్దలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డ్రైనేజీ, స్కూల్ విద్యా స్థాయి.. అన్నీ చూసి సూచనలు.గ్రామీణ ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయా? ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతుందా? స్కూళ్లలో పిల్లలు బాగా చదువుతున్నారా? ఇలాంటి కీలక అంశాలపై జిల్లా కలెక్టర్ ఆశిస్ సాంగ్వాన్ శుక్రవారం రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలో ఆకస్మిక సంద ర్శన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నుంచి ప్రభుత్వ పాఠ శాల వరకు అన్నీ పరిశీలించి,స్థానికులు,అధికారు లకు కీలక సూచనలు చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: ‘వేగంగా పూర్తి చేయండి.. నాణ్యత మరచవద్దు!’

గిద్ద గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారు ఇల్లు నిర్మిస్తున్న స్థలాన్ని కలెక్టర్ సాంగ్వా న్ ముందుగా పరిశీలించారు. పనుల పురోగతిని దగ్గరగా చూసి, లబ్ధిదారుతో మాట్లాడారు.ఇంటి నిర్మాణాన్ని వేగవంతం చేయండి.ప్రభుత్వం కట్టు బడి ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసి, నాణ్య తతో పూర్తి చేయాలి,” అని సూచించారు.లబ్ధిదారు చెప్పిన వివరాల్లో ఇప్పటివరకు ఖర్చు, తీసుకున్న రుణాలు, దశలవారీ నిధి కేటాయింపు, మునుపటి నివాసం, ప్రస్తుత ఉద్యోగం వంటి అంశాలు తెలుసు కున్నారు. గ్రామంలో డ్రైనేజీ కాలువలు,రోడ్ల రెండు వైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు పనుల ను పరిశీలించారు.పిచ్చి, చెత్త తొలగించి డ్రైనేజీ సరిగ్గా పనిచేయాలి. రోడ్లు శుభ్రంగా ఉండేలా, నీరు నిలవకుండా చూడండి. గ్రామంలో పరిశుభ్రతా కార్యక్రమాలు నిరంతరం జరగాలి,” అని అధికారు లకు ఆదేశాలు జారీ చేశారు.అనంతరం గ్రామంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లకు చేరుకున్న కలెక్టర్, విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ చేశారు. తరగతి గదిలో బోర్డుపై గణిత లెక్కలు వ్రాయించి, పిల్లల విద్యా సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించా రు. ఒక విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. పిల్లలు చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉపాధ్యా యులు నాణ్యమైన బోధన చేయాలి.ప్రాథమిక నైపుణ్యాలు మెరుగుపడేలా ప్రత్యేక చర్యలు తీసు కోవాలని సూచించారు. పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పెట్టు కోవాలని, ప్రత్యేక తరగతు లు నిర్వహించి లోపాలు సరిచేయాలని ఆదేశించా రు.ప్రతి పిల్ల ప్రతిభను వెలికితీయాలి.పరీక్షలకు పూర్తిగా సిద్ధం చేయాలని పేర్కొన్నారు.స్కూల్ ఆవరణంలో పిచ్చి,చెత్త లేకుండా శుభ్రంగా ఉంచా లని సూచించారు. కలెక్ట ర్ సందర్శనల్లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ్, ఆర్డిఓ వీణ, తహసిల్దార్ ఉమలత, డిపీఓ, డీఎం, డీఈఓ రాజు, ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.