బంటుమిల్లి మండలం బంటుమిల్లి బస్టాండ్ వద్ద, మరియు కృత్తివెన్ను మండలం చిన్న పాండ్రాక ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ప్రభుత్వం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని స్వయం గా చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్.
ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో శిబిరాలలో 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, వైద్యసిబ్బంది గ్రామాలలో ఐదేళ్ల లోపు చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలియో చుక్కలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలిపారు. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలనే సంకల్పంతో, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తాం అని అన్నారు.


