*తల్లితండ్రులు మర్చిపోవద్దు.. రేపే పల్స్ పోలియో*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో
నిర్వహించనున్నారు..
*ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను* తప్పక వేయించాలని ఇప్పటికే మంత్రి సత్య కుమార్ సూచించారు..
రాష్ట్రంలోని 54,07,663 మంది చిన్నారులకు 38,267 బూత్లు ఏర్పాటు చేశారు.
61,26,120 డోస్లను జిల్లాలకు సరఫరా చేశారు. ఏదైనా కారణంతో రేపు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు…


