Thursday, 12 February 2026
  • Home  
  • స్కిల్ కోసం ప్రపంచం ఉత్తరాంధ్రవైపు చూసే రోజు వస్తుంది : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.*
- విశాఖపట్నం

స్కిల్ కోసం ప్రపంచం ఉత్తరాంధ్రవైపు చూసే రోజు వస్తుంది : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.*

*స్కిల్ కోసం ప్రపంచం ఉత్తరాంధ్రవైపు చూసే రోజు వస్తుంది : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.* – ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు కావడం చారిత్రాత్మక దినం – ఈ పద్ధెనిమిది నెలలు చంద్రబాబు, లోకేష్ లు ఉత్తరాంధ్ర పై ప్రత్యేక దృష్టి. – ఏవియేషన్ లో కీలక సంస్కరణకు ఆనాడు మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు బీజం వేశారు. – 30 ఏళ్ల దూర దృష్టితో చంద్రబాబు ఆలోచన.. భవిష్యత్ అవసరాలు తీర్చనున్న GMR మాన్సాస్ ఎడ్యుసిటీ. *విశాఖపట్నం డిసెంబర్ 16 పున్నమి ప్రతినిధి*: నైపుణ్యం కోసం భవిష్యత్ లో ప్రపంచం.. ఉత్తరాంధ్ర వైపు చూస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం నాడు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో జిఎంఆర్, మన్సాస్ సంస్థల మధ్య ఏవియేషన్ ఎడ్యుసిటీ నిర్మాణం కోసం ఏం.ఓ.యు మార్పిడి కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో కలసి.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వేదికపై నుండి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు కావడం దేశంలోనే చరిత్రాత్మక రోజు అని రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండటంతో పాటు.. ఓ ఉత్తరాంధ్ర వాసిగా చాలా గర్వపడుతున్నా అని అన్నారు. గడిచిన పద్ధెనిమిది నెలలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల ప్రత్యేక దృష్టి ఉత్తరాంధ్ర పై నిలిపారని కితాబిచ్చారు. ఇన్నాళ్లు మనం చూసిన ఉత్తరాంధ్ర వేరు.. రేపటి ఉత్తరాంధ్ర వేరు అని స్పష్టం చేశారు. ప్రధానంగా ఏవియేషన్ రంగంలో ప్రపంచానికే కేంద్రంగా ఉత్తరాంధ్ర మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ మొదటి సారి బాధ్యతలు తీసుకున్నప్పుడు అందులో పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉండేవారని.. అనేక కీలక సంస్కరణలకు ఆనాడే ఆయన బీజం వేశారని అన్నారు. ప్రస్తుతం 12% వృద్ధి రేటుతో దూసుకుపోతున్న ఏకైక రంగం దేశ విమానయాన వ్యవస్థ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం 800 విమానాలు అందుబాటులో ఉంటే.. సమీప భవిష్యత్లో మరో 1700 విమానాలకు ఇప్పటికే ఆర్డర్లు వెళ్లాయని తెలిపారు. మిగిలిన లక్ష్యాలను పూర్తి చేసుకుని 3000 లకు పైగా విమానాలను కలిగి ప్రపంచంలోనే మేటిగా మన దేశ విమానాయన వ్యవస్థ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కో విమానం నుండి సరాసరి 100 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే.. లక్షలాది మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ఏవియేషన్ ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్ గా అభివర్ణించిన రామ్మోహన్ నాయుడు.. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం ఉన్నప్పటికీ.. అందుకు తగ్గ స్కిల్ సెంటర్లు లేవు అనే అసంతృప్తి ఉండేదని అన్నారు. తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రాష్ట్రంలో ఏవియేషన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలసి ఏవియేషన్ యూనివర్సిటీ ఆలోచన పంచుకుందామని ఆలోచన చేస్తే.. నా కన్నా ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విజన్ ను స్పష్టం చేశారని అన్నారు. 30,40 ఏళ్ల తర్వాత ప్రపంచం ఏమని ఆలోచిస్తుందో ముందే ఊహించే చంద్రబాబు నాయుడు.. ఏవియేషన్ యూనివర్సిటీ గురించి తన ఆలోచన చెప్పడం ఆశ్చర్యపోయా అని అన్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం శరవేగంగా జరుగుతోందని.. ఒక నెల రోజుల్లో వ్యాలీడేషన్ ఫ్లైట్ ల్యాండ్ కానుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మొత్తంగా విమానాశ్రయం నిర్మాణం పూర్తి జూన్ 2026 అనుకున్నాం కానీ.. అంతకన్నా ముందే ప్రారంభించే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపారు. జిఎంఆర్ మన్సాస్ ఎడ్యుసిటీ గురించి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కోసం నారా లోకేష్ తీవ్రంగా శ్రమించారని కితాబిచ్చారు. ఏవియేషన్ యూనివర్సిటీ అంటే ఒక కళాశాల కే పరిమితం అవుతుందని.. ఎడ్యుసిటీ గా మార్చడం వల్ల, అమెరికా వంటి ఇతర దేశాల్లో ఉన్న స్కిల్ కాలేజీలు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. లోకేష్ ఆలోచన మేరకు ఏవియేషన్ యూనివర్సిటీ ను.. ఎడ్యుసిటీ గా మార్చామని తెలిపారు. దీని ద్వారా మన దేశీయ ఏవియేషన్ అవసరాలు తీరడంతో పాటు.. ప్రపంచానికి కూడా వనరులు అందిస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర కు పూసపాటి కుటుంబం ఎంతో చేసిందని.. వారికి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు. పూసపాటి వంశీయులు మన ప్రాంతంలో ఉండటం ఉత్తరాంధ్ర చేసుకున్న అదృష్టం అని అన్నారు. ఎన్నో రాజ వంశీయుల కుటుంబాలు ఉన్నా.. విద్య పేరు చెబితే.. ధారాళంగా భూములు ఇచ్చే కుటుంబం పూసపాటి వంశం అని కితాబిచ్చారు. 136 ఎకరాలు ఇవ్వడం పై ధన్యవాదాలు తెలిపారు. GMR సంస్థ కూడా ఉత్తరాంధ్ర ప్రొడక్ట్ గా అభివర్ణించిన రామ్మోహన్ నాయుడు.. GMR.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి గౌరవం తెచ్చారని అన్నారు. విలువలు, మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తూ.. మన ప్రాంతానికి శక్తిని ఇచ్చే కార్యక్రమాలు GMR సంస్థ చేస్తోందని అన్నారు. ఈ ఎడ్యుసిటీ కి సంబంధించి నారా లోకేష్.. ఎలాంటి టైమ్ లైన్ ఇచ్చినా.. పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దీనికి ప్రతిగా పన్నెండు నెలల్లో పూర్తి చెయ్యాలని నారా లోకేష్ బదులిచ్చారు. రీసెర్చ్, ఇన్నోవేషన్.. ఈ ఎడ్యుసిటీ లో వృద్ధి చెందుతాయని.. నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం ఉన్న నేపథ్యంలో.. రాబోయే డిమాండ్ ను తట్టుకునేందుకు ఈ ఎడ్యుసిటీ ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి అందరూ సహకరించి.. భాగస్వామ్యం అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అదితి గజపతి రాజు, GMR సంస్థ నుండి GBS రాజు, ఉత్తరాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొన్నారు.

*స్కిల్ కోసం ప్రపంచం ఉత్తరాంధ్రవైపు చూసే రోజు వస్తుంది : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.*

– ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు కావడం చారిత్రాత్మక దినం
– ఈ పద్ధెనిమిది నెలలు చంద్రబాబు, లోకేష్ లు ఉత్తరాంధ్ర పై ప్రత్యేక దృష్టి.
– ఏవియేషన్ లో కీలక సంస్కరణకు ఆనాడు మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు బీజం వేశారు.
– 30 ఏళ్ల దూర దృష్టితో చంద్రబాబు ఆలోచన.. భవిష్యత్ అవసరాలు తీర్చనున్న GMR మాన్సాస్ ఎడ్యుసిటీ.

*విశాఖపట్నం డిసెంబర్ 16 పున్నమి ప్రతినిధి*: నైపుణ్యం కోసం భవిష్యత్ లో ప్రపంచం.. ఉత్తరాంధ్ర వైపు చూస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం నాడు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో జిఎంఆర్, మన్సాస్ సంస్థల మధ్య ఏవియేషన్ ఎడ్యుసిటీ నిర్మాణం కోసం ఏం.ఓ.యు మార్పిడి కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో కలసి.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వేదికపై నుండి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు కావడం దేశంలోనే చరిత్రాత్మక రోజు అని రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండటంతో పాటు.. ఓ ఉత్తరాంధ్ర వాసిగా చాలా గర్వపడుతున్నా అని అన్నారు.

గడిచిన పద్ధెనిమిది నెలలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల ప్రత్యేక దృష్టి ఉత్తరాంధ్ర పై నిలిపారని కితాబిచ్చారు. ఇన్నాళ్లు మనం చూసిన ఉత్తరాంధ్ర వేరు.. రేపటి ఉత్తరాంధ్ర వేరు అని స్పష్టం చేశారు. ప్రధానంగా ఏవియేషన్ రంగంలో ప్రపంచానికే కేంద్రంగా ఉత్తరాంధ్ర మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రధానిగా మోదీ మొదటి సారి బాధ్యతలు తీసుకున్నప్పుడు అందులో పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉండేవారని.. అనేక కీలక సంస్కరణలకు ఆనాడే ఆయన బీజం వేశారని అన్నారు. ప్రస్తుతం 12% వృద్ధి రేటుతో దూసుకుపోతున్న ఏకైక రంగం దేశ విమానయాన వ్యవస్థ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం 800 విమానాలు అందుబాటులో ఉంటే.. సమీప భవిష్యత్లో మరో 1700 విమానాలకు ఇప్పటికే ఆర్డర్లు వెళ్లాయని తెలిపారు. మిగిలిన లక్ష్యాలను పూర్తి చేసుకుని 3000 లకు పైగా విమానాలను కలిగి ప్రపంచంలోనే మేటిగా మన దేశ విమానాయన వ్యవస్థ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కో విమానం నుండి సరాసరి 100 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే.. లక్షలాది మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు.

ఏవియేషన్ ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్ గా అభివర్ణించిన రామ్మోహన్ నాయుడు.. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం ఉన్నప్పటికీ.. అందుకు తగ్గ స్కిల్ సెంటర్లు లేవు అనే అసంతృప్తి ఉండేదని అన్నారు. తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రాష్ట్రంలో ఏవియేషన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలసి ఏవియేషన్ యూనివర్సిటీ ఆలోచన పంచుకుందామని ఆలోచన చేస్తే.. నా కన్నా ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విజన్ ను స్పష్టం చేశారని అన్నారు. 30,40 ఏళ్ల తర్వాత ప్రపంచం ఏమని ఆలోచిస్తుందో ముందే ఊహించే చంద్రబాబు నాయుడు.. ఏవియేషన్ యూనివర్సిటీ గురించి తన ఆలోచన చెప్పడం ఆశ్చర్యపోయా అని అన్నారు.

భోగాపురం విమానాశ్రయం నిర్మాణం శరవేగంగా జరుగుతోందని.. ఒక నెల రోజుల్లో వ్యాలీడేషన్ ఫ్లైట్ ల్యాండ్ కానుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మొత్తంగా విమానాశ్రయం నిర్మాణం పూర్తి జూన్ 2026 అనుకున్నాం కానీ.. అంతకన్నా ముందే ప్రారంభించే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపారు.

జిఎంఆర్ మన్సాస్ ఎడ్యుసిటీ గురించి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కోసం నారా లోకేష్ తీవ్రంగా శ్రమించారని కితాబిచ్చారు. ఏవియేషన్ యూనివర్సిటీ అంటే ఒక కళాశాల కే పరిమితం అవుతుందని.. ఎడ్యుసిటీ గా మార్చడం వల్ల, అమెరికా వంటి ఇతర దేశాల్లో ఉన్న స్కిల్ కాలేజీలు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. లోకేష్ ఆలోచన మేరకు ఏవియేషన్ యూనివర్సిటీ ను.. ఎడ్యుసిటీ గా మార్చామని తెలిపారు. దీని ద్వారా మన దేశీయ ఏవియేషన్ అవసరాలు తీరడంతో పాటు.. ప్రపంచానికి కూడా వనరులు అందిస్తామని స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్ర కు పూసపాటి కుటుంబం ఎంతో చేసిందని.. వారికి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు. పూసపాటి వంశీయులు మన ప్రాంతంలో ఉండటం ఉత్తరాంధ్ర చేసుకున్న అదృష్టం అని అన్నారు. ఎన్నో రాజ వంశీయుల కుటుంబాలు ఉన్నా.. విద్య పేరు చెబితే.. ధారాళంగా భూములు ఇచ్చే కుటుంబం పూసపాటి వంశం అని కితాబిచ్చారు. 136 ఎకరాలు ఇవ్వడం పై ధన్యవాదాలు తెలిపారు.

GMR సంస్థ కూడా ఉత్తరాంధ్ర ప్రొడక్ట్ గా అభివర్ణించిన రామ్మోహన్ నాయుడు.. GMR.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి గౌరవం తెచ్చారని అన్నారు. విలువలు, మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తూ.. మన ప్రాంతానికి శక్తిని ఇచ్చే కార్యక్రమాలు GMR సంస్థ చేస్తోందని అన్నారు.

ఈ ఎడ్యుసిటీ కి సంబంధించి నారా లోకేష్.. ఎలాంటి టైమ్ లైన్ ఇచ్చినా.. పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దీనికి ప్రతిగా పన్నెండు నెలల్లో పూర్తి చెయ్యాలని నారా లోకేష్ బదులిచ్చారు.

రీసెర్చ్, ఇన్నోవేషన్.. ఈ ఎడ్యుసిటీ లో వృద్ధి చెందుతాయని.. నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం ఉన్న నేపథ్యంలో.. రాబోయే డిమాండ్ ను తట్టుకునేందుకు ఈ ఎడ్యుసిటీ ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి అందరూ సహకరించి.. భాగస్వామ్యం అవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అదితి గజపతి రాజు, GMR సంస్థ నుండి GBS రాజు, ఉత్తరాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.