– ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు!
కామారెడ్డి, 15 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ మండలం, ఎల్లారెడ్డి గ్రామంలో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో అద్భుతం గా గెలిచిన సర్పంచ్ పాలకవర్గానికి సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్య క్రమం నిర్వహించారు. గ్రామ ప్రజల సమూహాల్లో ఉత్సాహం మార్పు తెచ్చి, సంబరాలతో కూడిన ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రతి చోటూ చర్చనీయాంశ మైంది.ఈ సందర్భంగాసొసైటీ చైర్మన్ మర్రి సదాశి వరెడ్డి మాట్లాడుతూ, మా గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చెప్పారు. ఎల్లవేళలా సేవలోనే మీ మన్ననలు పొందుతారని హామీ ఇస్తున్నాను. గ్రామ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం’ అని ప్రజలకు పిలునిచ్ఛారు.గ్రామస్తుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించాయి.సర్పంచ్ పాలకవర్గం స్థానిక సమస్య ల పరిష్కారంలో,గ్రామ అభివృద్ధిలో ముందంజలో ఉంటూ పనిచేస్తారని చైర్మన్ తెలిపారు.ఈ సన్మా నం గ్రామంలో ఐక్యతను మరింత బలపరిచిందని, భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టాలని కోరారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అందరూ పాల్గొన్నారు.

