విశాఖపట్నం: ఇంటిగ్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ (IIAM) వైజాగ్ వారిచే ప్రతి ఏడాది నిర్వహించే ప్రతిష్టాత్మక Alumni Meet 2025 ఈ నెల 13, 14 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రతినిధులు ప్రకటించారు.
MVP కాలనీలోని IIAM క్యాంపస్‌లో ఉదయం 10 గంటలనుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు “Re-unite, Interact & Have Fun” అనే థీమ్‌తో మళ్లీ ఒక్కచోట చేరనున్నారు.
పూర్వ విద్యార్థుల ఎదుగుదల,వారి అనుభవాలను పంచుకుంటూ, కొత్త అవకాశాలపై చర్చిస్తూ ఆనందోత్సాహాలతో జరిగే ఈ మీట్ కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిజిస్ట్రేషన్ కోసం, అలాగే క్యాంపస్ టూర్ కోసం ప్రత్యేకంగా QR కోడ్‌లు కూడా విడుదల చేశారు.
సోషల్ మీడియాలో అధికారిక హ్యాండిల్స్ ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయని IIAM బిజినెస్ స్కూల్ అధినేత డా ఎస్ పి రవీంద్ర, ప్రతినిధులు తేజ ముత్యం తెలిపారు.


