*తెలుగుశాఖలో ఘనంగా కట్టమంచి రామలింగారెడ్డి 145 వ జయంతి వేడుకలు*
*విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:-*
ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు శాఖలో కట్టమంచి 145 వ జయంతి వేడుకలు బుధవారం (10-12-2025) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, ఆర్ట్స్ కళాశాల ప్రినిపాల్ ఆచార్య అడ్డాడ నరసింహారావు కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్య క్రమానికి అధ్యక్షత వహించిన తెలుగుశాఖాధిపతి మాట్లాడుతూ-
కట్టమంచి రామలింగారెడ్డి గారూ ముసలమ్మ మరణము, నవ యామిని, కవిత్వ తత్త్వ
విచారము, పంచమి,వ్యాసమంజరి, అర్థశాస్త్రము మొదలైన గ్రంథాలు రాసి తెలుగు సాహిత్యములో తనకంటూ ప్రత్యేకమైన విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నత మూర్తి కట్టమంచి అని ఆచార్య జర్రా అప్పారావు అన్నారు ఆంధ్ర విశ్వకళాపరిషత్ కి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఆయన ఉత్తమ పరిపాలనా దక్షుడు ఈరోజు ఈ విశ్వవిద్యాలయము ఇంత చక్కగా ఉండడానికి ఆ రోజు ఆయన వేసిన పునాదులే కారణం అని తెలుగు శాఖాధిపతి పేర్కొన్నారు.
ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఏ. నరసింహారావు గారు మాట్లాడుతూ 100 ఏళ్లకు ముందే ఎంతో దూరదృష్టి తో ఈ విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఏర్పాటుకు ఆయన చాలా గొప్ప ప్రయత్నం చేశారు. ఈనాడు ఈ విశ్వవిద్యాలయం కోట్లమంది విదార్థులకు జ్ఞానాన్ని అందిస్తుంది అని పేర్కొన్నారు.
ఆచార్య యోహన్ బాబు గారు మాట్లాడుతూ ఉత్తమ పరిపాలనా దక్షుడు, జ్ఞాన సంపన్నుడు అని అన్నారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఈ రోజు ఇక్కడ ఉండి విద్యార్థులు కు జ్ఞానపు వెలుగులు పంచుతుందంటే కట్టమంచే కారణం అని పేర్కొన్నారు.
డాక్టర్ దామెర వెంకట సూర్య రావు గారు మాట్లాడుతూ కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర ఆవిర్భావ దశలో విద్యావేత్తగా, కవిగా, రాజనీతిజ్ఞుడుగా, విమర్శకుడిగా తనదైన విశిష్టమైన విలక్షణమైన స్థానాన్ని సంపాదించారు.మద్రాస్ క్రైస్తవ కళాశాలలో చదువు పూర్తయిన అనంతరం ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో అనుబంధమైనటువంటి సంస్థలో తత్వశాస్త్రము, ఆర్థిక శాస్త్రము ఆప్షనల్ గా తీసుకొని ఎంఏ పూర్తి చేశారు అని పేర్కొన్నారు. బరోడా, మైసూర్ సంస్థానాల్లో ఆచార్యుడిగా పని చేశారు కొంతకాలం రాజకీయ రంగంలో ప్రవేశించి జస్టిస్ పార్టీలో చేరి మద్రాసులో శాసనసభ్యుడుగా పని చేశారు.
ఆ తర్వాత ఆయన దృష్టి పూర్తిగా విద్యాసాహిత్య రంగాల వైపు పడింది రామలింగారెడ్డి గారు విమర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.ఆయన గొప్ప కవి కూడా 1899 లో క్రైస్తవ కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు సమర్ధ రంగయ్య శెట్టి గారి ప్రోత్సాహంతో ఆ నిర్వహించిన పద్య కవిత కావ్యాల పోటీలో ఆయన రచించిన ముసలమ్మ మరణం కావ్యంగా తొలి ఖండకావ్యం గా ప్రసిద్ధి పొందింది. ఆ కావ్యానికి ఉత్తమ కావ్యంగా బహుమతి గెలిచింది. ఈ కావ్యం లో కొన్ని నవీనమైన పోకడలు బ్రౌన్ దొరగారు సేకరించినటువంటి అనంతపురం మండల చరిత్రలో ఇది ఉన్నది. అనంతపురం సమీపంలో ఉన్న బుక్కరాయి సముద్రం చెరువుకి కట్ట తెగి ఆ ఊరు మునిగిపోయి అపారంగా జన నష్టం జరిగే సందర్భంలో అక్కడి ప్రజలకు ఒక ఆకాశవాణి కలలో కనిపించి ఈ ఊళ్లో ఉండే ముసలమ్మ అనే స్త్రీ ఆ గట్టుకు అడ్డుగా పడితే నష్టం నివారించబడుతుంది అని చెప్పడం వల్ల ఆ ఊరి ప్రజలకు కోరిక మీద ఆవిడ ప్రాణం త్యాగం చేసింది స్త్రీ పాత్ర ప్రధానంగా చర్చించడం సాంఘిక ఇతివృత్తాన్ని స్వీకరించి నవయామిని కావ్యంగా రాశారు ఆ తర్వాత అంపకాలు మొదలైన ఖండకావ్యాలు కూడా రాశారు. రచనా విధానం అంతా కూడా సంప్రదాయ పద్ధతిలో సాగడం కొంత సంప్రదాయమైన విశ్వాసాలని ప్రతిపాదిస్తుంది అని కూడా విమర్శకులు చెప్పారు.
తరువాత ఆచార్య వెలమల సిమ్మన్న మాట్లాడుతూ ఆంధ్ర విశ్వ కళాపరిషత్తును పోషించిన వారుగా దాని భవిష్యత్తును కాంక్షించినవారుగా డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు చిరస్మరణీయులు అని పేర్కొన్నారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు కళలకు నిలయము ఆంధ్ర విశ్వకళాపరిషత్ . ఈ స్థాయికి ఈ విశ్వవిద్యాలయం రాడానికి ప్రధాన కారకులు ప్రేరకులు మంచి పరిపాలన దక్షులు కట్టమంచని ఆచార్య సిమ్మన్న అన్నారు. విమర్శలో విశ్వరూపాన్ని ప్రదర్శించినటు వంటి మహానుభావుడు విఖ్యాత విమర్శకుడు డాక్టర్ కట్టమంచి. అందుచేతనే కట్టమంచి తెలుగు సాహిత్య విమర్శకులకు ఆచార్యులకే ఆచార్యులు అయ్యారు. అంతేకాకుండా ప్రముఖ పండితుల చేత రచయితల చేత విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్న మహా మేధావి కట్టమంచని సిమ్మన్న అన్నారు. కట్టమంచి అత్యంత ఆధునికుడు. భాష సనాతనం. 1926 ఏప్రిల్ 26వ తేదీన ఆంధ్ర విశ్వకళాపరిషత్ ప్రారంభమైంది ఇప్పుడు ఏప్రిల్ 26 2026 కి 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలుగు శాఖలో శాఖాధిపతి సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభ జరుగుతుంది.రెడ్డి గారు 1926 నుండి 1930 వరకు వైస్ ఛాన్స్లర్గా చేశారు. మరల 1936 నుండి 1949 వరకు వైస్ ఛాన్స్లర్గా చేశారు .ఆంధ్ర విశ్వ కళాపరిషత్తుకు రెడ్డి గారు రెండుసార్లు వైస్ ఛాన్సరగా పదవని స్వీకరించి ఉత్తమ పరిపాలనాదక్షుడు అనిపించుకున్నారు
ఈ సభా కార్యక్రమంలో పరిశోధక విద్యార్థి ఇళ్ల మురళీధరరావు రచించిన పాడ చక్కని శతకం అనే పద్య గ్రంథాన్ని ప్రాచార్యులు నరసింహారావు గారు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
ప్రథమ సంవత్సర విద్యార్థిని ఆశ ఆహ్వానంతో ప్రారంభం అయిన ఈ సదస్సు రత్నం చేసిన వందన సమర్పణతో ముగిసింది. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు డా. ఎం.కృష్ణవేణి, డా. ఎం.దాసు, డా.బి.సూర్యనారాయణ, డా. ఎం.ప్రతాప్, డా. పి.శ్రీనివాసరావు, డా. ఎల్.గిరీష్ కుమార్, డా.ఆర్.శివయ్య,పితాని ప్రసాద్ మరియు సాహితి వేత్తలు, పుర ప్రముఖులు, భాషాభిమానులు, పరిశోధకులు విద్యార్థులు పాల్గొన్నారు.


