*మర్రిపాడు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)*
మర్రిపాడు మండల కేంద్రం నందలి జీ.ఆర్.ఎన్ యూటీఎఫ్ భవన్ నందు యూటీఎఫ్ మండల కౌన్సిల్ సమావేశాలు మండల అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.పై సమావేశము నందు మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.యూ.టీ.ఎఫ్ మర్రిపాడు గౌరవ అధ్యక్షులుగా ఐ.భాస్కర్,మండల అధ్యక్షులుగా విజయభాస్కర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా కటారి సుధాకర్,కోశాధికారిగా షేక్ అబ్దుల్ మునాఫ్,ఎఫ్ డబ్లు ఎఫ్ కన్వీనర్ గా ఎన్.వెంకటేశ్వర్లు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.పై సమావేశమునకు జిల్లా కార్యదర్శి హెచ్ మోహన్ ప్రసాద్,జిల్లా ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ డైరెక్టర్ షేక్ నాయబ్,యూ.టీ.ఎఫ్ సీనియర్ నాయకులు సాంబశివారెడ్డి,షేక్ ఇస్మాయిల్,రత్తయ్య,శ్రీనివాసులు,గురవయ్య,వెంగయ్య,వెంకటేశ్వర్లు,రఫీ, వెంకటయ్య,దావూద్ మండల బాధ్యులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొనడం జరిగింది.


