హనుమకొండలోని ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న ఓ యువతి మీద కడిపికొండ బ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తులు రసాయనాలతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
బాధితురాలిది జనగాం జిల్లా జఫర్ ఘడ్ మండలం అని తెలిసింది. కాజీపేట ఏసీపీ, పోలీసులు ఎంజీఎం ఆస్పత్రిలో బాధితురాలితో మాట్లాడి విచారణ చేస్తున్నారు. ఈ విషయం నగర పరిధిలో సంచలనం సృష్టించింది.
బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. తన కూతురు కాలేజీకి వెళ్లొస్తున్న సమయంలో కడిపికొండ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు రసాయనాలతో తన కూతురిపై దాడి చేశారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారిస్తున్నట్టు వెల్లడించారు.


