నెల్లూరు జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు పి.వి. కండ్రిగ ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛ మరియు హరిత విద్యాలయ రేటింగ్ పరిశీలనను జిల్లా సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజర్ గోగుల రమణయ్య నిర్వహించారు. పాఠశాల పచ్చదనం, పరిశుభ్రత, కిచెన్ గార్డెన్, మరుగుదొడ్లు, వంటగది తదితరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎం.ఇ.ఓ సునీల్ కుమార్ విద్యార్థుల ఆరోగ్యం కోసం పచ్చదనం, పరిశుభ్రత కీలకమని సూచించారు. ఎం.ఐ.సి కోఆర్డినేటర్ మల్లికార్జున విద్యార్థుల్లో పరిశుభ్రత అలవాట్లు పెంపొందించాలని తెలిపారు. సర్పంచ్ సుధీరమ్మ, కమిటీ చైర్మన్ విజయ, హెచ్.ఎం. రామచంద్రయ్య పాల్గొన్నారు.

ఇందుకూరుపేట పి.వి. కండ్రిగ పాఠశాలలో స్వచ్ఛ & హరిత విద్యాలయ పరిశీలన