*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న జీవీఎంసీ జోన్ 7 జోనల్ కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు డి రాజశేఖర్ రెడ్డి కోరారు.
అనకాపల్లి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి వెల్ఫేర్ సెక్రెటరీ నూకరాజు పని ఒత్తిడి మరియు జోనల్ కమిషనర్ పెడుతున్న ఇబ్బందులతో ఈ నెల 20న గుండె పోటుతో మరణించారని మీడియాకు తెలిపారు.గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విశాఖపట్నం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దృష్టికి తమ సమస్యలు తీసుకువచ్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ కు మంగళవారం ఈ మేరకు పిర్యాదు చేసినట్లు తెలిపారు.జోనల్ కమిషనర్ ఎక్కడ ఉన్నా ఇదే పద్ధతిగా ఉద్యోగులను వేధిస్తూ ఉంటారని, మహిళా ఉద్యోగుల సెల్ఫోన్ తీసుకొని చెక్ చేసి వారిని కూడా ఇబ్బందికి గురి చేస్తున్నారని తమదృష్టికి వచ్చిందన్నారు. సదరు జోనల్ కమిషనర్ మీద ఎంక్వయిరీ చేసి కఠిన చర్యలు తీసుకొవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు.కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఎంక్వయిరీ వేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.నూకరాజు కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అండగా ఉంటుందని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న జీవీఎంసీ జోన్ 7 జోనల్ కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు డి రాజశేఖర్ రెడ్డి కోరారు.
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న జీవీఎంసీ జోన్ 7 జోనల్ కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు డి రాజశేఖర్ రెడ్డి కోరారు. అనకాపల్లి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి వెల్ఫేర్ సెక్రెటరీ నూకరాజు పని ఒత్తిడి మరియు జోనల్ కమిషనర్ పెడుతున్న ఇబ్బందులతో ఈ నెల 20న గుండె పోటుతో మరణించారని మీడియాకు తెలిపారు.గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విశాఖపట్నం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దృష్టికి తమ సమస్యలు తీసుకువచ్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ కు మంగళవారం ఈ మేరకు పిర్యాదు చేసినట్లు తెలిపారు.జోనల్ కమిషనర్ ఎక్కడ ఉన్నా ఇదే పద్ధతిగా ఉద్యోగులను వేధిస్తూ ఉంటారని, మహిళా ఉద్యోగుల సెల్ఫోన్ తీసుకొని చెక్ చేసి వారిని కూడా ఇబ్బందికి గురి చేస్తున్నారని తమదృష్టికి వచ్చిందన్నారు. సదరు జోనల్ కమిషనర్ మీద ఎంక్వయిరీ చేసి కఠిన చర్యలు తీసుకొవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు.కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఎంక్వయిరీ వేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.నూకరాజు కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అండగా ఉంటుందని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

