అనకాపల్లి, నవంబర్ 24:
విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాబోయే తేదీ 13-12-2025 న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది కావున కేసుల్ని వేగవంతంగా, సౌహార్దపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఇది అత్యంత కీలకమైన అవకాశమని అధికారులు తెలిపారు.
ఈ జాతీయ లోక్ అదాలత్‌లో కింది రకాల కేసులు రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చు:
వివిధ న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు,
సివిల్ కేసులు,
చెక్ బౌన్స్ కేసులు (Sec.138 NI Act),
బ్యాంకింగ్–మనీ రికవరీ కేసులు, మోటార్ వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కుటుంబ తగాదాలు (విడాకుల కేసులు కాకుండా), కార్మిక– పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు,
కక్షిదారులు తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకునేందుకు, న్యాయ ప్రక్రియను వేగవంతం చేసుకునేందుకు ఈ అవకాశాన్ని అందరూ తప్పక వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు సూచించారు. పోలీసు శాఖ ప్రజలకు ఎల్లపుడూ అందుబాటులో ఉండి అవసరమైన సహాయాన్ని అందిస్తుందని కూడా ఆయన తెలిపారు.
వివరాలకు సంప్రదించవలసిన చిరునామాలు:
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవా సదన్, జిల్లా కోర్టు ప్రాంగణం, విశాఖపట్నం.
మండల న్యాయ సేవా సంఘాలు: అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల.


