Wednesday, 11 February 2026
  • Home  
  • అరకు: కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ జీవో కాపీలను దగ్ధం చేసిన కార్మికులు
- అల్లూరి సీతారామరాజు

అరకు: కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ జీవో కాపీలను దగ్ధం చేసిన కార్మికులు

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను అమలులోకి తెస్తూ ఈ నెల 21న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా శనివారం సిఐటియు ఆధ్వర్యంలో అరకులోయ నాలుగు రోడ్లు జంక్షన్లో లేబర్ కోడ్ల జీవో కాపీలను కార్మికులు తగలబెట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ..కార్మిక చట్టాలకు వలస పాలన వాసనలు ఉన్నాయని వాటిని ఆధునికరించి అమలు చేసేందుకే నాలుగు లేబర్ కోడ్లు తెస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదంతా అబద్ధం అని పేర్కొన్నారు. వలస పాలనకు మించి బానిసత్వాన్ని కార్మికవర్గం మీద రుద్దేందుకు, కార్పొరేట్లకు కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసేందుకే కేంద్రం నాలుగు లేబర్ కోడ్లను అమలులోకి తెచ్చిందని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ లేబర్ కోడ్ లలో అనేక కార్మిక వ్యతిరేక మార్పులను చొప్పించారని అన్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న కార్మిక చట్టాల ప్రకారం ఏదైనా కర్మాగారం లేదా కంపెనీ లే-ఆఫ్ చేయాలన్నా,లేదా లాకౌట్ చేయాలన్న 100 మంది అంతకుమించి కార్మికులు ఉంటే ఆ సంస్థ తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కాని కొత్తగా అమలు లోకి వస్తున్న లేబర్ కోడ్ ల ప్రకారం ఈ షరతు 300 మంది కార్మికులు ఉన్న కంపెనీలకు ఫ్యాక్టరీలకు వర్తించే విధంగా మార్చారు. అంటే 300 లోపు కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలు కంపెనీల యజమానులు తమ ఇష్టానుసారం పరిశ్రమలను లే-ఆఫ్ లేదా లాకౌట్లు చేసుకోవచ్చు అనే విధంగా లేబర్ కోడ్ లు ఉన్నాయన్నారు. ఈ విధంగా మూసివేస్తామని బెదిరిస్తూ కార్మికుల హక్కుల మీద, ఉద్యోగ భద్రత మీద, జీతభత్యాల మీద, వేటు వేసేందుకు యాజమాన్యాలకు ఆయుధం ఇచ్చినట్లు అయింది. అంతే కాకుండా ఈ లేబర్ కోడ్ లు కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేస్తున్నాయి. కనీస వేతనం, పర్మినెంట్, ఇతర కార్మిక మౌలిక సౌకర్యాలు ఆడకుండా గొంతు నొక్కే పని చేస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న వైసిపి కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ కి అనుకూలంగా ఉంటూ నరేంద్ర మోడీకి, కార్పొరేట్లకు మద్దతు తెలుపుతున్నారు. భవిష్యత్తులో నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై పెద్ద ఎత్తున కేంద్రంపై ప్రతిఘటన చేసేందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని ఊమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఐటిడిఏ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దాడి రాజు, అప్పలరాజు, జిసిసి సోప్ యూనిట్ వర్కర్స్ యూనియన్ సత్యారావు, గిరిజన సంఘం నాయకులు రామారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.