చిట్వేల్ నవంబర్ 21పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో కోడూరు మండల నాయకులు మరియు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం శుక్రవారం విజయవంతంగా జరిగింది. మండలానికి చెందిన పలు గ్రామాలు, పంచాయతీల అభివృద్ధి, ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.మండలంలోని పంచాయతీల నుంచి వచ్చిన నాయకులు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అందుబాటులో లేని మౌలిక సదుపాయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా రూపానంద రెడ్డి ,తెలియజేశారు. ప్రతి గ్రామానికి సంబంధించి సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి గారు మాట్లాడుతూ—“కోడూరు మండల నాయకులు ప్రస్తావించిన సమస్యలను సమగ్రంగా పరిశీలిస్తాం. ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత. ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు అందేలా కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో రైల్వే కోడూరు అభివృద్ధి మరింత వేగవంతం కానుంది” అని పేర్కొన్నారు.ఇటీవల రైల్వే కోడూరు అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.“గౌరవ చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రైల్వే కోడూరు అభివృద్ధిలో కొత్త అధ్యాయం రాబోతోంది. పార్టీ బలోపేతంతో పాటు అభివృద్ధి పట్ల ప్రతి నేత బాధ్యతగా వ్యవహరించాలి” అని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ జయప్రకాశ్ కోడూరు మండల నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు


