*క్రియేటివ్ హబ్ గా వైజాగ్ – దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని విశాఖ రానున్న రోజుల్లో క్రియేటివ్ రంగానికి హబ్ గా మారనుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు విశాఖ, విశాఖ పరిసరాల్లో ప్రారంభమయ్యాయన్నా. సీనియర్ జర్నలిస్టు ఎం.ఎన్.ఆర్. స్థాపించిన బిజ్ హబ్ క్రియేషన్ సంస్థను ఆయన ప్రారంభించారు. అన్ని రకాల క్రియేటివ్ కంటెంట్, బెస్ట్ గ్రాఫిక్స్, ఎడిటింగ్ సర్వీసెస్ అందించే సంస్థ విశాఖలో ప్రారంభించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన ఇలాంటి సేవలు విశాఖలో రావడం అభినందనీయమన్నారు.
గతంలో ఇదే ప్రాంతం నుంచి ఎంతోమంది సినీ, క్రియేటివ్ రంగాల్లో సక్సెస్ సాధించారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర, మరీముఖ్యంగా విశాఖపట్నంలో అన్ని రంగాల్లో ప్రతిభావంతులున్నారని, రానున్న రోజుల్లో వారందరికి సరైన గుర్తింపు తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖ వేదికగా 30 వ సి.ఐ.ఐ. బిజినెస్ సమ్మెట్ ను ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.
విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన ఈ కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన ప్రముఖలతో పాటుగా పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.


