పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 19 : తెలంగాణ కోసం ఓవైపు అక్షర పోరాటం చేశాం.. మరోవైపు ఉద్యమంలో పాలుపంచుకున్నాం.. తెలంగాణ వచ్చింది.. ప్రభుత్వాలు మారాయి.. కానీ జర్నలిస్టుల మా రాత మాత్రం మారలేదు.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా జర్నలిస్టుల బతుకులు తెల్లారుతున్నాయి.. ఇంకా ఎంతకాలం వేడుక చూస్తారు.. అంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కమిటీ ప్రభుత్వం పైనా, అధికారుల పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జర్నలిస్టులకు అక్రిడియేషన్ కార్డులు, విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కోరుతూ బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు.అధ్యక్షుడు శేరిబాయి గణేష్ కార్యదర్శి మైల సైదులు మాట్లాడుతూ రెండేళ్లు దాటిన ఇప్పటిదాకా జర్నలిస్టులకు కొత్త అక్రిడియేషన్ కార్డులు ఇవ్వకుండా స్టిక్కర్లతో కాలక్షేపం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. దీనివల్ల జర్నలిస్టు వృత్తి నుంచి తొలగించబడిన వ్యక్తులు కార్డులు ఉపయోగించుకుంటుండగా, కొత్త జర్నలిస్టులకు ఇప్పటివరకు కార్డులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు, డి పి ఆర్ ఓలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇన్నేళ్లుగా అక్రిడియేషన్ కార్డులు ఇచ్చే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. పాఠశాలల్లో ఫీజు రాయితీ విషయంలోనూ డీఈవో లేఖలు ఇచ్చిన ప్రైవేటు విద్యాసంస్థలు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా రంగంలో ఉంటూ నాయకులకు సేవ చేస్తూ జర్నలిస్టులు సాధించింది ఏమీలేదని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇస్తామన్న ఆశలు కూడా నీరుగారిపోయాయని పేర్కొన్నారు. సమాజంలో అందరి బాగోగులను పట్టించుకుంటాం.. కానీ మన బాగోగులు ఎవరూ పట్టించుకోరు. జర్నలిస్టులకు వెంటనే కొత్త అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్.. కాంగ్రెస్ దొందు దొందే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విషయంలో గత పది ఏళ్లలో బీఆర్ఎస్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జర్నలిస్టు కేపీ అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండేళ్లకు దగ్గర పడుతున్న ఇప్పటివరకు జర్నలిస్టుల సమస్య ల గురించి ప్రస్తావన లేదని అన్నారు. జర్నలిస్టుల విషయంలో రెండు ప్రభుత్వాలు దొందు దొందే అన్నట్టు వ్యవహరించడం దారుణం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవచేసి జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. స్థానికంగా ఎమ్మెల్యేలు కూడా జర్నలిస్టుల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జర్నలిస్టుల సమస్యలు తీర్చకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ముందుకు తీసుకు వెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు..

* జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఉద్యమమే —తెలంగాణ వచ్చినా.. ప్రభుత్వాలు మారినా..* –రాతమారని జర్నలిస్టుల బతుకులు* –జర్నలిస్టులు తెలంగాణ పోరాటం చేయలేదా..* –అక్రిడియేషన్ కార్డులకు ఎందుకు ఇంత జాప్యం ఎందుకు..?* –రాజీలేని పోరాటాల ద్వారానే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం* –చలో జర్నలిస్టుల రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆందోళన కార్యక్రమం* —జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కి వినతి పత్రం సమర్పణ*
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 19 : తెలంగాణ కోసం ఓవైపు అక్షర పోరాటం చేశాం.. మరోవైపు ఉద్యమంలో పాలుపంచుకున్నాం.. తెలంగాణ వచ్చింది.. ప్రభుత్వాలు మారాయి.. కానీ జర్నలిస్టుల మా రాత మాత్రం మారలేదు.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా జర్నలిస్టుల బతుకులు తెల్లారుతున్నాయి.. ఇంకా ఎంతకాలం వేడుక చూస్తారు.. అంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కమిటీ ప్రభుత్వం పైనా, అధికారుల పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జర్నలిస్టులకు అక్రిడియేషన్ కార్డులు, విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కోరుతూ బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు.అధ్యక్షుడు శేరిబాయి గణేష్ కార్యదర్శి మైల సైదులు మాట్లాడుతూ రెండేళ్లు దాటిన ఇప్పటిదాకా జర్నలిస్టులకు కొత్త అక్రిడియేషన్ కార్డులు ఇవ్వకుండా స్టిక్కర్లతో కాలక్షేపం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. దీనివల్ల జర్నలిస్టు వృత్తి నుంచి తొలగించబడిన వ్యక్తులు కార్డులు ఉపయోగించుకుంటుండగా, కొత్త జర్నలిస్టులకు ఇప్పటివరకు కార్డులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు, డి పి ఆర్ ఓలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇన్నేళ్లుగా అక్రిడియేషన్ కార్డులు ఇచ్చే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. పాఠశాలల్లో ఫీజు రాయితీ విషయంలోనూ డీఈవో లేఖలు ఇచ్చిన ప్రైవేటు విద్యాసంస్థలు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా రంగంలో ఉంటూ నాయకులకు సేవ చేస్తూ జర్నలిస్టులు సాధించింది ఏమీలేదని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇస్తామన్న ఆశలు కూడా నీరుగారిపోయాయని పేర్కొన్నారు. సమాజంలో అందరి బాగోగులను పట్టించుకుంటాం.. కానీ మన బాగోగులు ఎవరూ పట్టించుకోరు. జర్నలిస్టులకు వెంటనే కొత్త అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్.. కాంగ్రెస్ దొందు దొందే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విషయంలో గత పది ఏళ్లలో బీఆర్ఎస్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జర్నలిస్టు కేపీ అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండేళ్లకు దగ్గర పడుతున్న ఇప్పటివరకు జర్నలిస్టుల సమస్య ల గురించి ప్రస్తావన లేదని అన్నారు. జర్నలిస్టుల విషయంలో రెండు ప్రభుత్వాలు దొందు దొందే అన్నట్టు వ్యవహరించడం దారుణం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవచేసి జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. స్థానికంగా ఎమ్మెల్యేలు కూడా జర్నలిస్టుల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జర్నలిస్టుల సమస్యలు తీర్చకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ముందుకు తీసుకు వెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు..

