పెద్దాపురం, నవంబర్ 17, 27వ వార్డులోని బ్రహ్మల వీధి (బ్రహ్మల కాలనీ) నివాసులు రోడ్డు, డ్రైనేజీ సౌకర్యాలు లేక రోజువారీ జీవితంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిషత్‌లో పెద్దాపురం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు బొలిశెట్టి రామ్‌కుమార్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు సానుకూలంగా స్పందించి, త్వరలోనే సిబ్బందిని పంపి పరిశీలించి, మూడు నెలల్లో సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాలనీలో రోడ్లు లేకుండా, డ్రైనేజీ వ్యవస్థ లోపం కారణంగా నివాసులు తుఫానులు, వర్షాల సమయంలో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, పిల్లలు, వృద్ధులు ఈ సమస్యలతో మరింత ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు బొలిశెట్టి రామ్‌కుమార్ ప్రజా సమస్యల సమావేశంలో వివరంగా చెప్పి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
కాలనీ నివాసులు సమస్యలను వివరించడానికి చెల్లిపోయిన రత్నం, డి. సురేష్, జి. కుమారి, నాగమ్మ, జ్యోతి, భవాని, జి. సురేష్ తదితరులు పాల్గొన్నారు. వారు రోడ్లు నిర్మాణం, డ్రైనేజీ లైన్లు వేయాలని, ఇలాంటి సౌకర్యాలు లేకుండా రోగాలు, అధిక వ్యయాలు పెరుగుతున్నాయని తెలిపారు.
మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ, సమస్యలు గుర్తించి. బడ్జెట్, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, మూడు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని కాలనీ వాసులకు నమ్మకాన్ని కల్పిస్తూ, హామీ ఇవ్వడం జరిగింది.


