*అమరావతి*నవంబర్ ( విశాఖ పున్నమి ప్రతినిధి)
విశాఖపట్నంలోని బురుజుపేటలో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవం ఏర్పాట్లపై రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఆలయ ఉప కమిషనర్ & కార్యనిర్వాహణాధికారి శ్రీమతి కే. శోభారాణి గారు నేడు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
*ఈ సందర్భంగా EO శోభారాణి మాట్లాడుతూ*
బురుజుపేటలో లక్షలాదిగా విచ్చేసే భక్తులను దృష్టిలో పెట్టుకొని వసతి, రక్షణ, పారిశుధ్యం, క్యూ లైన్లు, పార్కింగ్, దర్శనం ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సౌకర్యాలు తదితర అంశాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి గారికి వివరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పలు చర్యలు చేపట్టామని తెలిపారు.
అలాగే శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి చరిత్రాత్మక వైభవం, భక్తుల అపార విశ్వాసం వల్ల ప్రతి సంవత్సరం మార్గశిర మహోత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నామని EO తెలియజేశారు.
*ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ*
దేవాదాయ శాఖ తరఫున అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. భక్తులకు కలిగె ఇబ్బందులను ముందుగానే అంచనా వేసి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.
మహోత్సవాలు మరింత ఘనంగా సాగాలని ఆకాంక్షించారు.
శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి తల్లి ఆశీస్సులతో విశాఖపట్నం మొత్తం సంపన్నతతో కళకళలాడాలని మంత్రి ఆనం అభిలషించారు


