CII 30 వ భాగస్వామ్య సదస్సు 2025
ప్లీనరీ సెషన్ 13
విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
*ఇండియన్ ఇండస్ట్రీల్స్ కన్ఫెడరేషన్ (CII) 30 వ భాగస్వామ్య సదస్సు 2025 మొదటి రోజైన శుక్రవారం సాయంత్రం 5:45 నుండి 6:30 వరకు ప్లీనరీ హాల్, హాల్ 5 నందు“భారతదేశం – ప్రపంచ స్థాయి ఆధునిక తయారీ కేంద్రంగా”అంశంపై చర్చ జరిగింది.*
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి. భరత్ మాట్లాడుతూ,భారతదేశం తన బలమైన పారిశ్రామిక పునాదులు, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు మరియు డిజిటల్ పురోగతిని ఉపయోగించుకొని, ఆధునిక తయారీ రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇది టెక్నాలజీ ఆధారిత, ఆవిష్కరణ నడిపే ఉత్పత్తి విధానాల వైపు దిశ మార్చుకుంటూ, ఇండస్ట్రీ 4.0 మరియు గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా ముందుకు సాగుతోందన్నారు. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపు ఎంతో తోడ్పడుతోందన్నారు.
మెక్సికో,ఆగ్వాస్కాలియెంటెస్ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎసావ్ గార్జా డి వాగా మాట్లాడుతూ, భారతదేశం తమ దేశంతో బలమైన సంబంధాన్ని కొనసాగించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాము ఇండియా తో ఒక ఎంఓయూ ను కూడా కుదుర్చుకోబోతున్నామని తెలిపారు.
ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఏరోస్పేస్ మరియు పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో భారతదేశం కీలక పాత్ర పోషించేందుకు వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌పై సత్య రామమూర్తి, చైర్మన్, పబ్లిక్ సెక్టార్, స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆసియా- పసిఫిక్, సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్, సింగపూర్, NICCT & ACG ఇంటర్నేషనల్, నెదర్లాండ్స్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీమతి ఎడిత్ ఎన్. నార్డ్‌మాన్, స్వీడన్, సీనియర్ అడ్వైజర్, మోనెమస్ AB & KIGO కన్సల్టెంట్స్, హాకన్ కింగ్స్టెడ్, కార్పొరేట్ వ్యవహారాలు, ఆక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ , బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు & ప్రెసిడెంట్ డి.వి. గిరి చర్చించారు.
ఈ కార్యక్రమ మోడరేటర్ గా CII నేషనల్ కమిటీ ఆన్ స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, రాక్వెల్ ఆటోమేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ దిలీప్ సాహ్నీ వ్యవహరించారు.


