Thursday, 5 February 2026
  • Home  
  • జగ్గయ్యపేటలో గ్రంథాలయ వారోత్సవాలకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ శ్రీకారం
- ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో గ్రంథాలయ వారోత్సవాలకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ శ్రీకారం

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని గ్రేడ్–శాఖ గ్రంథాలయంలో శుక్రవారం ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ప్రారంభించారు. బాలల దినోత్సవం సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు అర్పించి ఆయన నివాళులు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ “విద్య మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే శక్తి. రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు, ఐటీ–విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు సంస్కరణలు అమలు చేస్తున్నారు. స్మార్ట్ క్లాస్‌రూమ్‌ లు, ఈ–లైబ్రరీలు, డిజిటల్ లెర్నింగ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది” అని చెప్పారు. జగ్గయ్యపేట గ్రంథాలయాన్ని వినియోగించి డీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే— “ఇలాంటి విజయాలు పెరగాలంటే గ్రంథాలయాలను బలోపేతం చేయాలి. కొత్త పుస్తకాలు, డిజిటల్ వనరులు, చదవడానికి అనువైన వాతావరణం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. యువత పఠన సంస్కృతిని అలవర్చు కోవాలి” అని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కౌన్సిలర్లు గొట్టే నాగరాజు, పేరం సైదేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇనుపనూర్తి రాజు, పితాని శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని గ్రేడ్–శాఖ గ్రంథాలయంలో శుక్రవారం ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ప్రారంభించారు. బాలల దినోత్సవం సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు అర్పించి ఆయన నివాళులు తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ
“విద్య మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే శక్తి. రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు, ఐటీ–విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు సంస్కరణలు అమలు చేస్తున్నారు. స్మార్ట్ క్లాస్‌రూమ్‌ లు, ఈ–లైబ్రరీలు, డిజిటల్ లెర్నింగ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది” అని చెప్పారు.
జగ్గయ్యపేట గ్రంథాలయాన్ని వినియోగించి డీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే—
“ఇలాంటి విజయాలు పెరగాలంటే గ్రంథాలయాలను బలోపేతం చేయాలి. కొత్త పుస్తకాలు, డిజిటల్ వనరులు, చదవడానికి అనువైన వాతావరణం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. యువత పఠన సంస్కృతిని అలవర్చు కోవాలి” అని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కౌన్సిలర్లు గొట్టే నాగరాజు, పేరం సైదేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇనుపనూర్తి రాజు, పితాని శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.