బాలల దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను సతీమణి, విమలభాను ఫౌండేషన్ చైర్మన్ సామినేని విమలభాను విద్యార్థు లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె జగ్గయ్యపేట నియోజక వర్గంలోని వత్సవాయి మండలం, మక్కపేటలో ఉన్న సాయి సెంచరీ హై స్కూల్‌లో జరిగిన బాలల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విమానభాను మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయా ల్సిన బాధ్యత కలిగి ఉంటారని పేర్కొన్నారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కు పిల్లలంటే ఉన్న అనురక్తి కారణంగా ఆయన జయంతిని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా నిర్వహిస్తా మని తెలిపారు. అటువంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. నేటి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఎక్కువగా ఉన్నందున దానిని సద్విని యోగం చేసుకుని సమాజ అభివృద్ధికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సామినేని విమలభాను
బాలల దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను సతీమణి, విమలభాను ఫౌండేషన్ చైర్మన్ సామినేని విమలభాను విద్యార్థు లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె జగ్గయ్యపేట నియోజక వర్గంలోని వత్సవాయి మండలం, మక్కపేటలో ఉన్న సాయి సెంచరీ హై స్కూల్‌లో జరిగిన బాలల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. విమానభాను మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయా ల్సిన బాధ్యత కలిగి ఉంటారని పేర్కొన్నారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కు పిల్లలంటే ఉన్న అనురక్తి కారణంగా ఆయన జయంతిని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా నిర్వహిస్తా మని తెలిపారు. అటువంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. నేటి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఎక్కువగా ఉన్నందున దానిని సద్విని యోగం చేసుకుని సమాజ అభివృద్ధికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.

