Sunday, 7 December 2025
  • Home  
  • మెడికవర్ ఆసుపత్రిలో నొప్పిని సమర్ధవంతంగా ట్రీట్ చేసే విధానాలు లభ్యం.
- విశాఖపట్నం

మెడికవర్ ఆసుపత్రిలో నొప్పిని సమర్ధవంతంగా ట్రీట్ చేసే విధానాలు లభ్యం.

మెడికవర్ ఆసుపత్రిలో నొప్పిని సమర్ధవంతంగా ట్రీట్ చేసే విధానాలు లభ్యం. *విశాఖ పట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి:-* నగరంలోని మెడికవర్ ఆసుపత్రుల్లో నొప్పిని సమర్ధవంతంగా అదుపుచేసే చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి సీనియర్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ కె.వి.డి.ప్రవీణ్ తెలిపారు. నగరంలోని అరిలోవ మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నొప్పి అనేది కేవలం శారీరక అసౌకర్యం మాత్రమే కాదని, అది మన మనసును, మన జీవనశైలిని పూర్తిగా ప్రభావితం చేసే సమస్యన్నారు. దీర్ఘకాలిక నొప్పి కారణంగా అనేక మంది తమ రోజువారీ పనులు, నిద్ర, కుటుంబ జీవితం అన్నీ కోల్పోతున్నా రన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ, నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా సరైన చికిత్స తీసుకోవాలనే సందేశంతో తాము ఆధునిక నొప్పి చికిత్సపై ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తున్నా మన్నారు. నొప్పి అనేది శరీరం పంపే హెచ్చరిక సంకేతమన్నారు. దాన్ని పట్టించుకోకపోతే అది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. సరైన వైద్య నిపుణుడిని సంప్రదిస్తే మళ్లీ సాధారణ జీవితాన్ని సులభంగానే పొందవచ్చన్నారు. పెయిన్ ఫిజీషియన్లు కేవలం మందులు మాత్రమే కాకుండా, నొప్పి మూలకారణాన్ని గుర్తించి, దానిని శాశ్వతంగా తగ్గించే ఆధునిక చికిత్సలు అందిస్తా రన్నారు. నడుం నొప్పి, ఆర్థరైటిస్, డయాబెటిక్ న్యూరోపతి, క్యాన్సర్ అనంతర నొప్పులు తదితర సమస్యలకు ప్రత్యేక చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయన్నారు. తమ మెడికవర్ ఆసుపత్రిలో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, నర్వ్ బ్లాక్స్, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్లు, టెండన్ బోటాక్స్ ఇంజెక్షన్లు తదితర ఆధునిక పద్ధతుల ద్వారా నొప్పిని సమూలంగా తగ్గించడం సాధ్యమన్నారు. సుమారు 80 శాతం నొప్పులను సరైన నిపుణులచే చికిత్స చేస్తే పూర్తిగా నియంత్రించ వచ్చన్నారు. నొప్పిలేని జీవితం కల కాదని, అది ప్రతి ఒక్కరి హక్కని అన్నారు. మూడు నెలలకంటే ఎక్కువ కాలం నొప్పి కొనసాగితే లేదా రోజువారీ పనుల్లో ఆటంకం కలిగిస్తే, వెంటనే పెయిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించా లన్నారు. ఈ మీడియా సమావేశంలో మెడికవర్ సెంటర్ హెడ్ డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ కిషోర్, డాక్టర్ సృజన, డాక్టర్ రోజాలిన్, డాక్టర్ ఇంగే తదితర వైద్యులు పాల్గొన్నారు.

మెడికవర్ ఆసుపత్రిలో నొప్పిని సమర్ధవంతంగా ట్రీట్ చేసే విధానాలు లభ్యం.
*విశాఖ పట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి:-*
నగరంలోని మెడికవర్ ఆసుపత్రుల్లో నొప్పిని సమర్ధవంతంగా అదుపుచేసే చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి సీనియర్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ కె.వి.డి.ప్రవీణ్ తెలిపారు. నగరంలోని అరిలోవ మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నొప్పి అనేది కేవలం శారీరక అసౌకర్యం మాత్రమే కాదని, అది మన మనసును, మన జీవనశైలిని పూర్తిగా ప్రభావితం చేసే సమస్యన్నారు. దీర్ఘకాలిక నొప్పి కారణంగా అనేక మంది తమ రోజువారీ పనులు, నిద్ర, కుటుంబ జీవితం అన్నీ కోల్పోతున్నా రన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ, నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా సరైన చికిత్స తీసుకోవాలనే సందేశంతో తాము ఆధునిక నొప్పి చికిత్సపై ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తున్నా మన్నారు. నొప్పి అనేది శరీరం పంపే హెచ్చరిక సంకేతమన్నారు. దాన్ని పట్టించుకోకపోతే అది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. సరైన వైద్య నిపుణుడిని సంప్రదిస్తే మళ్లీ సాధారణ జీవితాన్ని సులభంగానే పొందవచ్చన్నారు. పెయిన్ ఫిజీషియన్లు కేవలం మందులు మాత్రమే కాకుండా, నొప్పి మూలకారణాన్ని గుర్తించి, దానిని శాశ్వతంగా తగ్గించే ఆధునిక చికిత్సలు అందిస్తా రన్నారు. నడుం నొప్పి, ఆర్థరైటిస్, డయాబెటిక్ న్యూరోపతి, క్యాన్సర్ అనంతర నొప్పులు తదితర సమస్యలకు ప్రత్యేక చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయన్నారు. తమ మెడికవర్ ఆసుపత్రిలో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, నర్వ్ బ్లాక్స్, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్లు, టెండన్ బోటాక్స్ ఇంజెక్షన్లు తదితర ఆధునిక పద్ధతుల ద్వారా నొప్పిని సమూలంగా తగ్గించడం సాధ్యమన్నారు. సుమారు 80 శాతం నొప్పులను సరైన నిపుణులచే చికిత్స చేస్తే పూర్తిగా నియంత్రించ వచ్చన్నారు. నొప్పిలేని జీవితం కల కాదని, అది ప్రతి ఒక్కరి హక్కని అన్నారు. మూడు నెలలకంటే ఎక్కువ కాలం నొప్పి కొనసాగితే లేదా రోజువారీ పనుల్లో ఆటంకం కలిగిస్తే, వెంటనే పెయిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించా లన్నారు. ఈ మీడియా సమావేశంలో మెడికవర్ సెంటర్ హెడ్ డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ కిషోర్, డాక్టర్ సృజన, డాక్టర్ రోజాలిన్, డాక్టర్ ఇంగే తదితర వైద్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.