పువ్వాడ నాగేంద్ర కుమార్
( పున్నమి దినపత్రిక తెలంగాణ ప్రతి నిధి)
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారం నేడు సాయంత్రం ముగియనుంది. చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రబలమైన ప్రణాళికలు అమలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తమ తమ శక్తి సామర్థ్యాలను వినియోగిస్తూ ర్యాలీలు, మినీ మీటింగ్‌లు నిర్వహించాయి.
ఈ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,98,056 మంది మహిళలు, 2,03,309 మంది పురుషులు కాగా, 18 మంది ఇతర లింగ వర్గానికి చెందినవారు. మొత్తం 123 పోలింగ్ కేంద్రాల్లో రేపు ఓటింగ్ జరగనుంది.
ప్రధానాంశాలు:
చివరి దశకు చేరిన ఎన్నికల ప్రచారం
115 జూబ్లీహిల్స్ బూత్‌లలో రేపు పోలింగ్
పోటీదారుల మధ్య హోరాహోరీ పోరు
బిజీగా సర్వేలు, వ్యూహరచన:
ప్రచార చివరి రోజున బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శిబిరాల్లో వ్యూహరచనకు వేడి చర్చలు కొనసాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే చివరి ప్రయత్నంగా పార్టీలు డోర్ టు డోర్ ప్రచారంలో నిమగ్నమయ్యాయి.
కాంగ్రెస్ పక్షం నుండి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రచార సమీక్ష నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి కూడా శ్రేణులతో సమావేశమై తుది వ్యూహాన్ని ఖరారు చేశారు


