గౌరవ సీఎండీ గారి ఆదేశముల మేరకు ప్రజలలో విద్యుత్ సరఫరా మీద ఉన్న అభిప్రాయము మెరుగు పడేలా చేసే ప్రయత్నంలో భాగంగా కింద తెలిపిన ప్రణాళిక అమలు చేయవలెను
1.సోమవారం
ప్రతి ఒక్క జూనియర్ లైన్ మెన్ వారం లో ప్రతి సోమవారం తన పరిధిలోని 10 మంది వినియోగదారులతో మొబైల్ ఫోన్ లో మాట్లాడవలెను
2.మంగళవారం
అసిస్టెంట్ లైన్ మెన్ /లైన్ మెన్ 10 మందితో మాట్లాడవలెను
3.బుధవారం
లైన్ ఇన్స్పెక్టర్ /సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ / ఫోర్ మెన్ 10 మందితో మాట్లాడవలెను
4.గురువారం
ఏ యి గారు 20 మందితో మాట్లాడవలెను
5 శుక్రవారం
DEE గారు 30 మంది తో మాట్లాడవలెను
6.శనివారం
EE గారు 40 మందితో మాట్లాడవలెను
7.గౌరవ SE గారు వారంలో ఎదో ఒక రోజు 50 మందితో మాట్లాడవలెను.
మాట్లాడేప్పుడు వారితో కింద తెలిపిన సమాచారం అడగవలెను
A.విద్యుత్ సరఫరా సక్రమంగా ఉందా లేదా
B.వోల్టెజ్ అప్ అండ్ డౌన్ ఉందా
C.సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా
ఇవ్వన్ని ఒక పుస్తకములో నమోదు చేయవలెను.
పైన తెలిపిన సూచిక మనము అమలు చేసి వారంతమునకు రిపోర్ట్ ను పై అధికారులకు తెలుపవలెను.

