విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో కమిషనర్ ధ్యానచంద్ర, శాప్ చైర్మన్ ఏ. రవి నాయుడు, యం.డి ఎస్ భరణి లతో పాటు ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నాను.
నగరంలోని క్రీడా ప్రాంగణాలను జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించటం జరిగింది. స్టేడియాల పునరుద్ధరణకు సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రతిపాదనలు, ఆధునిక సదుపాయాల ఏర్పాటు, క్రీడాకారులకు అవసరమైన వసతుల విస్తరణ, స్థానిక క్రీడా కార్యకలాపాల ప్రోత్సాహంపై విస్తృతంగా సమీక్షించాము.
నగరవాసులతో పాటు క్రీడాకారులకు మెరుగైన క్రీడా వసతులు అందించడానికి విజయవాడను రాష్ట్రంలోని ప్రముఖ క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించాము.
ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ప్రాజెక్ట్ డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ పి.సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీనాధ్, లతో పాటు శాప్ అధికారులు తదితరులు పాల్గొన్నారు…


