Thursday, 12 February 2026
  • Home  
  • దక్షిణంలో దిగ్విజయంగా కోటి సంతకాల సేకరణ
- విశాఖపట్నం

దక్షిణంలో దిగ్విజయంగా కోటి సంతకాల సేకరణ

దక్షిణంలో దిగ్విజయంగా కోటి సంతకాల సేకరణ * ఐదు వార్డుల నివేదికను వాసుపల్లికి అందజేసిన వార్డు అధ్యక్షులు *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దక్షిణంలో ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు 27, 29, 31, 33, 34 వార్డులలో పూర్తి చేసిన కోటి సంతకాల నివేదికను ఆయా వార్డుల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కలిస్ మాజీ ఎమ్మెల్యే, దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పరిరక్షించాలంటూ స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో భాగస్వాములు అవుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ను వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజా ఉద్యమానికి గురికాక తప్పదని హెచ్చరించారు. భవిష్యత్తు తరాల కోసం జగనన్న వేసిన వంతెనే ఈ 17కాలేజీల నిర్మాణం అన్నారు. కానీ చంద్రబాబు పేదలు ఉన్నత చదువులు అభ్యసించ కూడదని, పేద వాళ్ళు పేద వాళ్లుగానే మిగిలిపోవాలనన్న కుట్ర ను వైఎస్సార్సీపీ తిప్పి కొడుతుందన్నారు. దక్షణ నియోజక వర్గంలో మిగిలిన 9 వార్డుల సంతకాల సేకరణ త్వరగా పూర్తి చేసి అధిష్టానం కి అందజేస్తామని వాసుపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ విభాగం ఛైర్మన్ జాన్ వెస్లీ, కార్పొరేటర్లు, దక్షిణ వైఎస్ఆర్సిపి వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

దక్షిణంలో దిగ్విజయంగా కోటి సంతకాల సేకరణ

* ఐదు వార్డుల నివేదికను వాసుపల్లికి అందజేసిన వార్డు అధ్యక్షులు
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*

మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దక్షిణంలో ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు 27, 29, 31, 33, 34 వార్డులలో పూర్తి చేసిన కోటి సంతకాల నివేదికను ఆయా వార్డుల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కలిస్ మాజీ ఎమ్మెల్యే, దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పరిరక్షించాలంటూ స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో భాగస్వాములు అవుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ను వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజా ఉద్యమానికి గురికాక తప్పదని హెచ్చరించారు. భవిష్యత్తు తరాల కోసం జగనన్న వేసిన వంతెనే ఈ 17కాలేజీల నిర్మాణం అన్నారు. కానీ చంద్రబాబు పేదలు ఉన్నత చదువులు అభ్యసించ కూడదని, పేద వాళ్ళు పేద వాళ్లుగానే మిగిలిపోవాలనన్న కుట్ర ను వైఎస్సార్సీపీ తిప్పి కొడుతుందన్నారు. దక్షణ నియోజక వర్గంలో మిగిలిన 9 వార్డుల సంతకాల సేకరణ త్వరగా పూర్తి చేసి అధిష్టానం కి అందజేస్తామని వాసుపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ విభాగం ఛైర్మన్ జాన్ వెస్లీ, కార్పొరేటర్లు,
దక్షిణ వైఎస్ఆర్సిపి వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.