ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హత్యలు, హత్యాచారాలు పెరుగుతున్నాయని గెడ్డం గంగాధర్ (అప్పనపల్లి), డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన మాట్లాడుతూ, ఇటీవల తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో జరిగిన ఘటనల్లో అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
ఇలాంటి విషాద ఘటనలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, భద్రతా చర్యలు లేకపోవడంపై ఆయన విమర్శించారు.
ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం, కల్తీ మద్యం అమ్మకాలను అడ్డుకోలేకపోవడం, ఆలయాల పట్ల నిర్లక్ష్యం ప్రభుత్వం పాలనలో తీవ్రంగా కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
గెడ్డం గంగాధర్ మాట్లాడుతూ –
“ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడం కంటే, ఆలయాల్లో భద్రతా చర్యలు చేపట్టడం, ప్రజల ప్రాణాలను కాపాడడం ముఖ్యమని ప్రభుత్వం గ్రహించాలి.
ఇప్పటికైనా మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం మేల్కొని అక్రమాలు, నిర్లక్ష్యాలు ఆగేలా చర్యలు తీసుకోవాలి,” అని పిలుపునిచ్చారు.


