Wednesday, 11 February 2026
  • Home  
  • ఓటు ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమం
- అన్నమయ్య

ఓటు ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమం

రాయచోటి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఎం,పీ యు,పి ఉర్దూ స్కూల్ నందు ఓటు ప్రాముఖ్యత గురించి ప్రత్యేక శిబిరం నిర్వహించడమైనది.ఇందులో భాగంగా 5వ రోజు ఓటు ప్రాముఖ్యత గురించి ఎన్ఎస్ఎస్ బృందం ప్రజలలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి,జ్యోతి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఒక పౌరుని అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యత పై అవగాహన కల్పించేందుకు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిందని అన్నారు.ఓటు వేయడం ప్రతి పౌరుని బాధ్యత అని, మనం ఓటు ద్వారా మంచి నాయకత్వాన్ని ఎంచుకోవచ్చని ప్రజలకు తెలిపారు. ఒక ఓటు కూడా దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి కలిగినదని ప్రజలకు వివరించారు.సమాజంలో మంచి మార్పు కోరుకునే ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు ప్రజలకు తెలిపారు.ఓటు మీ హక్కు మాత్రమే కాదు అది మీ భవిష్యత్తు కూడా అనే నినాదంతో ఎన్ఎస్ఎస్ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి. వెంకటరమణ, అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు,

రాయచోటి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఎం,పీ యు,పి ఉర్దూ స్కూల్ నందు ఓటు ప్రాముఖ్యత గురించి ప్రత్యేక శిబిరం నిర్వహించడమైనది.ఇందులో భాగంగా 5వ రోజు ఓటు ప్రాముఖ్యత గురించి ఎన్ఎస్ఎస్ బృందం ప్రజలలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి,జ్యోతి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఒక పౌరుని అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యత పై అవగాహన కల్పించేందుకు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిందని అన్నారు.ఓటు వేయడం ప్రతి పౌరుని బాధ్యత అని, మనం ఓటు ద్వారా మంచి నాయకత్వాన్ని ఎంచుకోవచ్చని ప్రజలకు తెలిపారు. ఒక ఓటు కూడా దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి కలిగినదని ప్రజలకు వివరించారు.సమాజంలో మంచి మార్పు కోరుకునే ప్రతి పౌరుడు తన ఓటు హక్కును
వినియోగించుకోవాలని వారు ప్రజలకు తెలిపారు.ఓటు మీ హక్కు మాత్రమే కాదు అది మీ భవిష్యత్తు కూడా అనే నినాదంతో ఎన్ఎస్ఎస్ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి. వెంకటరమణ, అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.